Begin typing your search above and press return to search.

వైష్ణవి కంటే ముందు ఆ ముగ్గురు ఎందుకు సెట్ కాలేదు?

ఒక పక్కా కన్వర్జేషనల్ లవ్ స్టోరీ తీయాలంటే అందులో నటించే వారికి భాష మీద మంచి పట్టు ఉండాలి.

By:  M Prashanth   |   1 Sept 2026 9:21 AM IST
వైష్ణవి కంటే ముందు ఆ ముగ్గురు ఎందుకు సెట్ కాలేదు?
X

ఒక పక్కా కన్వర్జేషనల్ లవ్ స్టోరీ తీయాలంటే అందులో నటించే వారికి భాష మీద మంచి పట్టు ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు ఆకట్టుకునేలా డైలాగ్స్ చెప్పే టాలెంట్ చాలా అవసరం. ఇదే పాయింట్ మీద 'ఎపిక్' సినిమా డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. లిటిల్ హార్ట్స్ చిత్ర రీసెంట్ న చిట్ చాట్ లో హీరోయిన్ క్యాస్టింగ్ గురించి ఆయన ఓపెన్ గా మాట్లాడారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ కోసం వైష్ణవి కంటే ముందే దాదాపు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను ట్రై చేశామని ఆదిత్య హాసన్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు వాళ్లని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని తను నిర్మాత నాగవంశీని కూడా చాలా పుష్ చేశానని, వాళ్లనే ఓకే చేయాలని గట్టిగా అడిగానని ఆయన నిజాయితీగా ఒప్పేసుకున్నారు.

అయితే అదృష్టవశాత్తూ ఆ ముగ్గురు అమ్మాయిలకు ఈ సినిమా కథ సరిగ్గా ఎక్కలేదని డైరెక్టర్ తెలిపారు. నరేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళకు ఈ స్టోరీ కనెక్ట్ కాలేదన్నారు. అందులో ఒక అమ్మాయి మాత్రం సినిమా చేస్తానని ఒప్పుకుందని, కానీ ఆమె ఆ పాత్రకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోయిందని చెప్పారు. మనకు కావాల్సిన రియలిస్టిక్ అవుట్ పుట్ రానప్పుడు వాళ్ళను కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని తనకు అనిపించిందని ఆదిత్య పేర్కొన్నారు.

వాళ్లు ఈ క్యారెక్టర్ కు సెట్ కాకపోవడానికి ప్రధాన కారణం భాష అని ఆదిత్య హాసన్ క్లారిటీ ఇచ్చారు. ఎపిక్ సినిమా ఒక కన్వర్జేషనల్ లవ్ స్టోరీ అని, ఇలాంటి కథకు పక్కాగా తెలుగు వచ్చిన వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరని అన్నారు. తాను ముందుగా ట్రై చేసిన ఆ ముగ్గురు అమ్మాయిలు తెలుగు వాళ్లు కాకపోవడంతోనే ఆ ఫీల్ ను, ఆ డైలాగ్స్ ను సరిగ్గా డెలివరీ చేయలేకపోయారని చెప్పారు.

వాళ్లతో సినిమా చేస్తే ఈ క్యారెక్టర్ కు వర్కవుట్ అవ్వదని తనకు క్లారిటీ వచ్చేసిందని, అందుకే ఇక లాభం లేదని వాళ్లను పక్కన పెట్టేసి సరే అని అక్కడి నుంచి వచ్చేశానని ఆదిత్య చెప్పుకొచ్చారు. అలా ఆ ముగ్గురు సెట్ కాకపోవడంతో ఫైనల్ గా ఆ పాత్రకు వైష్ణవి చైతన్య ఫిక్స్ అయింది. ప్రాజెక్ట్ లోకి వైష్ణవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, సెట్స్ లో ఆమె యాక్టింగ్ చూసి తాను చాలా ఇంప్రెస్ అయ్యానని డైరెక్టర్ చెప్పారు. ఏకంగా ఆమె నటనకు తాను ఒక బిగ్ ఫ్యాన్ అయిపోయానని ఆదిత్య హాసన్ వివరణ ఇచ్చారు. ఇక ఈ క్యూట్ లవ్ స్టోరీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది.