Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క సంచ‌ల‌నం సీనియ‌ర్ల‌తో ఛాన్స్ తీసుకోడా?

తాజాగా ఆదిత్య ధర్ తదుపరి చిత్రాల జాబితాలో కూడా యంగ్ హీరోల‌కే క‌నిపిస్తున్నారు. హిందీ-తెలుగు-త‌మిళ్ హీరోల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను ప్లాన్ చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   25 March 2026 4:00 AM IST
ద‌ర్శ‌క సంచ‌ల‌నం సీనియ‌ర్ల‌తో ఛాన్స్ తీసుకోడా?
X

దర్శక సంచలనం ఆదిత్య ధర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద `ధురందర్ 2`తో ప్రభంజనం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 761 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అయితే ఓ విష‌యంలో అదిత్య‌ పని తీరును గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఎక్కువగా ట్రెండింగ్ యంగ్ హీరోలతోనే ప్రయోగాలు చేసేందుకే ఆదిత్య‌ మొగ్గు చూపుతున్నారు. సీనియర్ స్టార్ల విషయంలో ఆయన రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరనే బాలీవుడ్ లో ఓవార్త వెలుగులోకి వ‌చ్చింది. సీనియ‌ర్ స్టార్ల‌ను కేవ‌లం కీల‌క పాత్ర‌ల‌క్ఏ ప‌రిమితం చేస్తున్న‌ట్లు క‌నిప‌నిస్తోంది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే...

ఆదిత్య ధర్ ఇప్పటి వరకు చేసిన ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, `ధురందర్ ఫ్రాంచైజీలను చూస్తే ఆయన కథలన్నీ హై-ఎనర్జీ యాక్షన్ , ఫిజికల్ డిమాండ్ ఉన్న రోల్స్ చుట్టే తిరిగాయి. రణవీర్ సింగ్ వంటి యువ నటులు మాత్ర‌మే ఈ పాత్రలకు ప్రాణం పోసారు. సీనియర్ హీరోలు ఎంతటి గ్రేస్ ఉన్న వారైనప్పటికీ ఆదిత్య ధర్ రాసుకునే అత్యంత వేగవంతమైన స్క్రీన్‌ప్లే , రా-యాక్షన్ సీక్వెన్స్‌లలో వారు లీడ్ రోల్స్ చేయడం కొంత కష్టమైన విషయమే. అందుకే ఆయన సీనియర్ల వైపు పెద్దగా చూడటం లేదనే టాక్ నడుస్తోంది.ఒకవేళ సీనియర్ స్టార్లు ఆదిత్య ధర్ సినిమాలో నటించాల్సి వస్తే వారు కథను నడిపించే ప్రధాన పాత్రలు కాకుండా కథను దిశానిర్దేశం చేసే కీలక పాత్రలు గానే సరిపోతారని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ధురందర్ సిరీస్‌లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి సీనియర్ నటులు నటించినప్పటికీ వారంతా కథను మలుపు తిప్పే కీలక పాత్రలకే పరిమితమయ్యారు తప్ప‌ యాక్షన్ అంతా రణవీర్ చుట్టూనే తిరిగింది. తాజాగా ఆదిత్య ధర్ తదుపరి చిత్రాల జాబితాలో కూడా యంగ్ హీరోల‌కే క‌నిపిస్తున్నారు. హిందీ-తెలుగు-త‌మిళ్ హీరోల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆయన విజన్ పూర్తిగా నేటి తరం ఆడియన్స్‌ను అలరించే యువ హీరోల చుట్టూనే ఉందని అర్థమవుతోంది. సీనియర్ హీరోల ఇమేజ్ , వారికున్న మాస్ ఫాలోయిం గ్‌ను హ్యాండిల్ చేయడం కంటే? తన కాన్సెప్ట్‌కు సరిపోయే ఎనర్జీ ఉన్న యంగ్ హీరోలతో పని చేయడమే సౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

సీనియర్ హీరోలు కూడా కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా వైవిధ్యమైన కథల కోసం వెతుకుతున్నారు. కానీ ఆదిత్య ధర్ వంటి దర్శకులు రాసుకునే మిలిటరీ లేదా స్పై డ్రామాల్లో ఫిజికల్ యాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల సీనియర్లకు అలాంటి పాత్రలు సూట్ కాకపోవచ్చు. ఒకవేళ ఆయన సీనియర్లతో సినిమా చేసినా? అది కేవలం ఒక మెంటార్ పాత్రలానో ? శక్తివంతమైన విలన్ పాత్రలానో ఉండే అవకాశం ఉంది తప్ప పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా వారిని ఊహించడం కష్టమే. ఆదిత్య ధర్ తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ బ్రాండ్‌లో యంగ్ హీరోలే ఫిట్ అవుతారని బలంగా నమ్ముతు న్నారు. అందుకే సీనియర్ స్టార్లతో రిస్క్ తీసుకునే కంటే బాక్సాఫీస్ వద్ద గ్యారెంటీ వసూళ్లు రాబట్టే ట్రెండింగ్ హీరోలతోనే తన ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ డైరెక్టర్ - స్టార్ ఈక్వేషన్ మారుతుందో లేదో వేచి చూడాలి.