Begin typing your search above and press return to search.

వీడియో : 'ధురంధర్‌' దర్శకుడి పాత వీడియో వైరల్‌

యామి గౌతమ్‌ ఒక ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న దర్శకుడు ఆధిత్య ధర్‌ ఆమె కంఫర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో వెనుక నుంచి ఒక పిల్లో పెట్టుకోవాలంటూ ఇవ్వడం జరిగింది.

By:  Ramesh Palla   |   20 March 2026 12:47 PM IST
వీడియో : ధురంధర్‌ దర్శకుడి పాత వీడియో వైరల్‌
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ధురంధర్‌ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ధురంధర్‌ మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సెకండ్‌ పార్ట్‌ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఆధిత్య ధర్‌ ధురంధర్‌ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ధురంధర్‌ 2 సినిమా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. దాంతో దర్శకుడు ఆధిత్య ధర్‌ గురించి ప్రస్తుతం పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ నుంచి వచ్చాడు ఇలా ఎన్నో విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు గాను నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆధిత్య ధర్‌ కి అభిమానులు పెరిగి పోయారని తాజాగా సోషల్‌ మీడియా ట్రెండ్‌ను చూస్తే అర్థం అవుతోంది.

యామి గౌతమ్‌ భర్త ఆధిత్య ధర్‌

ధురంధర్‌ 2 సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ఆధిత్య ధర్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన గత చిత్రాలు ఏంటి, ఆయన ఫ్యామిలీ వివరాలు అన్నీ తెలుసుకుంటున్నారు. దర్శకుడు ఆధిత్య ధర్‌ ఎవరో కాదు తెలుగులో హీరోయిన్‌గా సుపరిచితురాలు అయిన యామి గౌతమ్‌ భర్త. ఈయన కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలను చేయడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన దేశ భక్తి సినిమాలు ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆధిత్య ధర్‌ దారిలో చాలా మంది దర్శకులు దేశ భక్తి సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో హింస ఎక్కువ ఉన్నా కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వాడని, సౌమ్యుడు అంటూ ఆయన సన్నిహితులు, ఆయనతో వర్క్ చేసిన వారు అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన తన భార్య యామి పట్ల ఎంత శ్రద్ద, ప్రేమతో ఉంటాడో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

ఆధిత్యధర్‌ మంచి మనసు...

యామి గౌతమ్‌ ఒక ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న దర్శకుడు ఆధిత్య ధర్‌ ఆమె కంఫర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో వెనుక నుంచి ఒక పిల్లో పెట్టుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తన భార్య అయిన యామి గౌతమ్‌ గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె ప్రెస్‌మీట్‌ లో కంఫర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో అదనపు దిండు ఇవ్వడం ద్వారా ఆధిత్య ధర్‌ తన ఫ్యామిలీ విషయంలో ఎంత శ్రద్దగా ఉంటాడో అర్థం అవుతుంది. ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. చాలా మందితో పోల్చితే ఆధిత్య ధర్‌ సౌమ్యుడు అని, ఆయన ఎవరితోనూ ఎక్కువగా వివాదాలకు వెళ్లని వ్యక్తి అని అంటారు. అందుకే ఆయన గురించి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడటం, తప్పుడు ప్రచారం జరగడం లేదు. ఆధిత్య ధర్‌ సినిమాతోనే కాకుండా మంచితనంతోనూ వైరల్‌ అవుతున్నాడు.

రణ్వీర్‌ సింగ్‌ ధురంధర్‌ 2 మూవీ....

రణ్వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ 2 సినిమా విషయానికి వస్తే నిన్న విడుదలైన ఈ సీక్వెల్‌కి భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. పుష్ప 2 సినిమా యొక్క రికార్డ్‌ లు బద్దలు కొట్టినట్లుగా బాలీవుడ్‌ కి చెందిన మీడియా సోషల్‌ మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రచురిస్తోంది. అంతే కాకుండా ధురంధర్‌ 1 వసూళ్లతో పోల్చితే ధురంధర్‌ 2 సినిమా యొక్క వసూళ్లు దాదాపుగా రెట్టింపు ఉండే అవకాశం ఉందని, ఈసారి కేవలం హిందీలోనే కాకుండా మొత్తం సౌత్‌ ఇండియన్‌ భాషల్లోనూ సినిమా ఉన్న కారణంగా భారీ వసూళ్లు నమోదు కాబోతున్నాయి అంటున్నారు. ధురంధర్‌ 2 సినిమా ఓవర్సీస్‌ లోనూ భారీగా వసూళ్లు సాధించబోతుంది. ఇప్పటికే అక్కడ సాలిడ్‌ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ధురంధర్‌ 1 ను ఓటీటీ లో చూసి చాలా మంది అయ్యో థియేటర్‌ లో మిస్ అయ్యాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు ధురంధర్‌ 2 ను ఎక్కువ మంది థియేటర్‌ లో చూస్తారు అనే అభిప్రాయం ఉంది. దాదాపుగా నాలుగు గంటల రన్‌ టైమ్‌ తో వచ్చిన ధురంధర్‌ 2 సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో మేకర్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా వసూళ్ల ప్రభంజనం కనిపిస్తోందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.