భార్యకు తలగడ అందించిన దర్శకుడు.. ప్రేమ గౌరవానికి సూచిక..
సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో తన భార్య యామి గౌతమ్ పై ఆదిత్య ధర్ చూపిన శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది.
By: Sivaji Kontham | 20 March 2026 10:34 AM ISTకళాకారుల వ్యక్తిగత జీవితం, వృత్తిగత విజయం ఆనందంగా మారితే ఆ సన్నివేశమే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కపుల్ ఆదిత్య ధర్- యామి గౌతమ్ సరిగ్గా ఇటువంటి మధుర క్షణాలను అనుభవిస్తున్నారు. ఈ జంట సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం `దురంధర్` బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ విజయోత్సవ వేడుకలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది.
సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో తన భార్య యామి గౌతమ్ పై ఆదిత్య ధర్ చూపిన శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది. ఒక ఇంటర్వ్యూ లేదా ఈవెంట్ సమయంలో యామి కూర్చోవడానికి ఇబ్బంది పడకుండా ఆదిత్య స్వయంగా ఒక తలగడ (పిల్లో)ను అందించి తనకు సౌకర్యంగా ఉండేలా చూశారు. ఈ చిన్న పనిలో భార్యపై ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భార్యపై ప్రేమ అంటే ఇదే.. ఈ దర్శకుడే అందరికీ ఆదర్శం అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇక `దురంధర్ 2` సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే సుమారు 100 కోట్లు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
గతంలో `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` వంటి భారీ హిట్ ఇచ్చిన ఆదిత్య ధర్ `దురంధర్`తో మరోసారి తన సత్తా చాటారు. ఇప్పుడు సీక్వెల్ చిత్రం దురంధర్ 2 ఆదిత్యాధర్ స్థాయిని పదింతలు పెంచింది. ఈ సినిమాలో యామి గౌతమ్ పోషించిన పాత్రకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. వీరిద్దరూ కేవలం సినిమాల కోసమే కాకుండా నిజ జీవితంలో కూడా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. వృత్తిపరమైన విజయాలను ఆస్వాధిస్తూనే.. బంధానికి ఇచ్చే విలువ చూస్తుంటే అభిమానులకు ముచ్చటేస్తోంది.
ప్రస్తుతం ఈ జోడీ తమ సినిమా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మునుముందు దురంధర్ 2 మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కేవలం వసూళ్ల పరంగానే కాకుండా.. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందించినందుకు ఆదిత్య-యామి జంటపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
