Begin typing your search above and press return to search.

వాళ్లను అసలు పట్టించుకోను.. ఐ డోంట్ కేర్: 'ధురంధర్' డైరెక్టర్

అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

By:  M Prashanth   |   20 March 2026 7:52 PM IST
వాళ్లను అసలు పట్టించుకోను.. ఐ డోంట్ కేర్: ధురంధర్ డైరెక్టర్
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్‌: ది రివెంజ్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ చిత్రం మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు రూ.170 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ సినిమా 2026లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. "మూవీని ప్రోపగాండా (ప్రచారం) అంటూ విమర్శించే వారిని నేను పట్టించుకోను. ఆ కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు. ఇండియన్ ఆడియన్స్ చాలా తెలివైనవారు" అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ కామెంట్స్ కొందరి విమర్శలకు గట్టి కౌంటర్‌ గా నిలవగా, త్రోబ్యాక్ వీడియో వైరల్ అవుతోంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, దర్శకుడు మొత్తం భావాన్ని ఒక్క భగవద్గీత శ్లోకంతో చెప్పడం విశేషం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం హీరో జర్నీకి స్ట్రాంగ్ బేస్. ధర్మం కోసం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి గానీ రిజల్ట్ పై ఎప్పుడూ ఆశ పెట్టుకోకూడదనే మెసేజ్ ను హీరో పాత్ర మొదటి నుంచి చివరి వరకు చెబుతూనే ఉంటుంది. అదే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇప్పటివరకు అనేక స్పై యాక్షన్ థ్రిల్లర్లు వచ్చినప్పటికీ, ధురంధర్‌ సిరీస్‌ కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఒక ఖైదీని గూఢచారిగా మార్చి శత్రు దేశంలోకి పంపే కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే కథాంశాన్ని కొత్త మలుపులతో ధురంధర్‌: ది రివెంజ్ ను తెరకెక్కించారు ఆదిత్య ధర్. సీక్వెల్‌ లో యాక్షన్‌, థ్రిల్‌, ఎమోషన్‌, దేశభక్తి అన్నీ కలిపి ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందించారు.

ప్రతి సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా మలిచిన దర్శకుడు, కథను ఎక్కడా స్లో చేయకుండా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా చాప్టర్ల రూపంలో కథను చెప్పడం చిత్రానికి మరో ప్రత్యేకత. ప్రతి భాగం ప్రేక్షకుడిలో ఉత్కంఠను పెంచేలా రూపొందించారు. మరో ముఖ్య అంశం ఎండ్ క్రెడిట్స్ సమయంలో వచ్చే సన్నివేశాలు. వాటితో చివరి వరకు థియేటర్లలోనే కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు.

ఏదేమైనా ధురంధర్‌: ది రివెంజ్‌ ఒక లార్జర్ దాన్ లైఫ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ గా నిలిచింది. స్ట్రాంగ్ స్టోరీ, ఎఫెక్టివ్ మెసేజ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిసి సినిమాను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ వేలో నడిపిస్తున్నాయి. తొలి పార్ట్ లాగానే రెండో భాగం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇండియన్ బాక్సాఫీస్‌ కు ఇప్పటికే తెలిసిన స్పై కథనే కొత్తగా, మరింత గ్రాండ్‌ గా చెప్పొచ్చని దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి నిరూపించారు. మరి రాబోయే రోజుల్లో ధురంధర్ 2 మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.