Begin typing your search above and press return to search.

ధురంధ‌ర్2 త‌ర్వాత చేసే సినిమా పెను సంచ‌ల‌న‌మే!

తాజాగా ఈ సినిమాకొస్తున్న రివ్యూలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

By:  Srikanth Kontham   |   20 March 2026 4:00 AM IST
ధురంధ‌ర్2 త‌ర్వాత చేసే సినిమా పెను సంచ‌ల‌న‌మే!
X

`ధురంధ‌ర్` తో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం అయిన ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్. తొలి భాగం సింగిల్ లాంగ్వేజ్లోనే 1300 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌డితే? నేడు రిలీజ్ అయిన `ధురంధ‌ర్ 2` రిలీజ్ కు ముంది అడ్వాన్స్ బుకింగ్స్ తో మోతెక్కించింది. తాజాగా ఈ సినిమాకొస్తున్న రివ్యూలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

ఇక‌పై స్పై చిత్రాల గురించి మాట్లాడుకోవాలంటే `ధురంధ‌ర్ 2` కి ముందు త‌ర్వాత అన్న రేంజ్లో ప‌బ్లిక్ టాక్ రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఓ గొప్ప చిత్రంగా `ధురంధ‌ర్ 2` మిగిలిపోతుందంటున్నారు.

దేశ భ‌క్తి నేప‌థ్యాన్ని ముడిపెడుతూ ఓ స్పై సినిమా తీయాలంటే? దాన్ని అదిత్య ధ‌ర్ మాత్ర‌మే డీల్ చేయ‌గ‌ల‌డు. అన్న రేంజ్ లో మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తున్నాయి. దీంతో ఆదిత్య త‌దుప‌రి సినిమాపై అప్పుడే చ‌ర్చ మొద‌లై పోయింది. త‌దుప‌రి ఎలాంటి సినిమా తీస్తాడు? ఏ జాన‌ర్ ని ట‌చ్ చేస్తాడు? ఏ హీరోతో పనిచేస్తాడు? ఇలా ర‌క‌ర‌కాల డిస్క‌ష‌న్ నెట్టింట షురూ అయింది. ఈనేప‌థ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆదిత్య ధర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ముగ్గురు అగ్ర హీరోలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు వినిపిస్తోంది.

వారిలో మొదటి వ్యక్తి బాలీవుడ్ లో పెద్ద స్టార్ అని తెలిసింది. అలాగే టాలీవుడ్ నుంచి ఓ స్టార్..కోలీవుడ్ నుంచి మ‌రో పెద్ద స్టార్ ను తీసుకుని పాన్ ఇండియాలో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ కే అడుగులు వేస్తున్న‌ట్లు తెలిసింది.ఆ ముగ్గురు హీరోల‌తో ఓ యూనిక్ కాన్సెప్ట్ గురించి డిస్క‌స్ చేసాడుట‌. అదో మైథాలజీ - మోడరన్ వార్‌ఫేర్ కలయికతో ఉంటుందని సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అది భారతీయ సినిమాలోనే మరో భారీ పాన్-ఇండియా వండర్ కానుందని అంటున్నారు. దానికి సంబంధించి ఓ టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

`ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ` అనే ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇదొక సైన్స్ పిక్ష‌న్ సోషియో ఫాంట‌సీ చిత్రంగా తెలుస్తోంది.`ది ఇమ్మోర్ట‌ల్ అశ్వ‌థామ` అనేది భారతీయ పురాణగాథల్లోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా రూపొందించాలన్న‌ది ప్లాన్ గా తెలుస్తోంది. మహాభారత యుద్ధం తర్వాత అమరుడిగా మిగిలిపోయిన అశ్వత్థామ పాత్రను ఆధునిక కాలానికి అన్వయిస్తూ ఓ సూపర్ హీరో తరహాలో ఈ కథను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. అంటే పురాణాలలోని అంశాలను భవిష్యత్తు సాంకేతికతతో కలిపి చూపించే ప్రయత్నం అవ్వొచ్చు. ఇప్ప‌టికే ఈ జాన‌ర్ లో నాగ్ అశ్విన్ `క‌ల్కి`ని రెండు భాగాలుగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదిత్య ధ‌ర్ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ క్లారిటీ రాదు.