Begin typing your search above and press return to search.

ఆ సంచ‌ల‌నం క్రికెట‌ర్ అయితే ప్రేక్ష‌కులు అవ‌న్నీ మిస్!

కొందరు దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే తీయరు. వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తారు. అటువంటి వారిలో ఆదిత్య ధర్ ఒకరు.

By:  Srikanth Kontham   |   22 March 2026 4:00 AM IST
ఆ సంచ‌ల‌నం క్రికెట‌ర్ అయితే ప్రేక్ష‌కులు అవ‌న్నీ మిస్!
X

కొందరు దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే తీయరు. వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తారు. అటువంటి వారిలో ఆదిత్య ధర్ ఒకరు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అసలు లక్ష్యం సినిమా కాదని, ఆయన ఒక గొప్ప క్రికెటర్ అవ్వాలని కలలు కన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ ఆదిత్య ధర్ గనుక క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలోనే ఉండి ఉంటే? ఈరోజు భారతీయ ప్రేక్షకులు అద్భుతమైన దేశభక్తి చిత్రాలను, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలను ఖచ్చితంగా మిస్ అయ్యేవారు అన్న‌ది కాద‌న లేని నిజం. ఆదిత్య ధర్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణంగా ఉండేవారు.

ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే పట్టుదలతో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ క్రీడారంగంలో ఉండే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయనకు సరైన అవకాశాలు లభించలేదు. ఆ చేదు అనుభవాలు ఆయనను క్రీడలకు దూరం చేసినా? కళా ప్రపంచానికి దగ్గర చేశాయి. క్రికెట్ గ్రౌండ్‌లో చూపించాల్సిన తన కసిని కెమెరా వెనుక ఉండి వెండితెరపై చూపించాలని ఆయన నిర్ణయించుకోవడం భారతీయ సినిమాకు దక్కిన గొప్ప వరం. ఒకవేళ ఆదిత్య ధర్ క్రీడల్లోనే స్థిరపడి ఉంటే? `సర్జికల్ స్ట్రైక్` నేపథ్యంలో వచ్చిన `ఉరి` వంటి సంచలన చిత్రం వ‌చ్చేది కాదు.

భారత సైన్యం గొప్పతనాన్ని, వారి తెగువను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆ సినిమా, దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగాన్ని సృష్టించింది. కేవలం మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్న ఆదిత్య ధర్ తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆనాడే అర్ద‌మైంది ఆదిత్య ఫాలోవ‌ర్స్ కి ఈ విష‌యం. క్రికెట్ పాలిటిక్స్ వల్ల ఆయనను కోల్పోయిన క్రీడారంగం కంటే? దర్శకుడిగా ఆయనను పొందిన సినిమా రంగమే ఎక్కువ లాభపడిందని.

ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురందర్`2 పై దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో ఆదిత్య ధ‌ర్ చేసిన‌ ప్రయోగం బాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్పై థ్రిల్లర్ జోనర్‌లో రిలీజ్ అయిన‌ సినిమా ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్‌కు అంతా ఫిదా అవుతున్నారు. `ఉరి`తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆదిత్య ఇప్పుడు `ధురందర్ 2` ప్ర‌తీ భార‌తీయుడికి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నాడు. చివ‌రిగా జీవితంలో ఒక తలుపు మూసుకుంటే మరో గొప్ప తలుపు తెరుచుకుంటుంది అనడానికి ఆదిత్య ధర్ నిలువెత్తు సాక్ష్యం. క్రికెట్‌లో ఎదురైన ఆ రాజకీయాలే ఆయనను సినిమా వైపు మళ్ళించకపోయి ఉంటే? ఇంతటి గొప్ప దర్శకుడిని చూసేవాళ్లం కాదు. ఆయనలోని కసి, పట్టుదల ఇప్పుడు సినిమాల రూపంలో భార‌తీయ ప్రేక్ష‌కుల‌కు కనువిందు చేస్తున్నాయి. ఆదిత్య ధర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను వెండితెరపై అత్యంత విజయ వంతంగా కొన సాగిస్తూ తన కలలను నిజం చేసుకుంటున్నారు. మ‌రి భ‌విష్య‌త్ లో కోల్పోయిన క్రికెట్ నేప‌థ్యంలోనూ ఓ సినిమా చేస్తాడేమో చూడాలి.