Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ట్రెండ్ మార్చిన ఆ డైరెక్టర్ కు గవర్నమెంట్ లెవెల్ ఆఫర్!

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, అలాగే రణవీర్ సింగ్‌తో తీసిన ధురంధర్ చిత్రాల భారీ విజయాల తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మేకర్లలో ఒకరిగా నిలిచారు.

By:  Madhu Reddy   |   18 July 2026 12:56 PM IST
బాలీవుడ్ ట్రెండ్ మార్చిన ఆ డైరెక్టర్ కు గవర్నమెంట్ లెవెల్ ఆఫర్!
X

బాలీవుడ్‌లో ఒకప్పుడు లవ్ స్టోరీస్, క్రైమ్ థ్రిల్లర్స్ తీసే దర్శకులకే విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, అలాగే రణవీర్ సింగ్‌తో తీసిన ధురంధర్ చిత్రాల భారీ విజయాల తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మేకర్లలో ఒకరిగా నిలిచారు. దేశభక్తిని, రియలిస్టిక్ వార్ డ్రామాలను వెండితెరపై విజువల్ వండర్స్‌గా మార్చడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన బ్రాండ్. తాజాగా ఈ క్రేజీ దర్శకుడికి అస్సాం ప్రభుత్వం నుండి నేరుగా ఒక భారీ ఆఫర్ రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యమంత్రి పిలుపు -అరుదైన గౌరవం:

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. లెజెండరీ అహోం జనరల్ 'లచిత్ బోర్ఫుకన్' జీవిత చరిత్ర ఆధారంగా ఒక ప్రతిష్టాత్మక బయోపిక్‌ను తెరకెక్కించాల్సిందిగా ఆయన ఆదిత్య ధర్‌ను సంప్రదించారట. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా సానుకూలంగా సాగాయని సీఎం పేర్కొన్నారు. ఇక ఒక ప్రాంతీయ వీరుడి కథను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ప్రభుత్వమే ఒక దర్శకుడిని వెతుక్కుంటూ రావడం ఆదిత్య ధర్ సంపాదించుకున్న నమ్మకానికి నిదర్శనం.

బిజీ షెడ్యూల్‌లో సరికొత్త సవాల్:

'ధురంధర్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ లైనప్ చాలా ప్యాక్‌గా ఉంది. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ టాప్ స్టార్లతో సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక బిజీ షెడ్యూల్ మధ్యలో అస్సాం ప్రాజెక్ట్ రావడంతో ఫ్యాన్స్‌లోహైప్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు దీనిపై గ్రౌండ్ లెవెల్‌లో చూడడానికి, తదుపరి చర్చల కోసం ఆదిత్య ధర్ ఆగస్టులో అస్సాం టూర్‌కు వెళ్లనున్నారని సమాచారం.

దేశభక్తి చిత్రాలకు పెరిగిన డిమాండ్:

ఒకప్పుడు కేవలం మసాలా సినిమాలకే పరిమితమైన హిందీ పరిశ్రమ, ఇప్పుడు చరిత్రను, దేశం కోసం పోరాడిన వీరుల కథలను గౌరవిస్తోంది. ఆదిత్య ధర్ లాంటి దర్శకులు కేవలం సినిమా తీయడమే కాకుండా, అందులో ఉండే ఎమోషన్‌తో ప్రతి భారతీయుడి రక్తం మరిగేలా చేయగలరని నిరూపించారు. ఇక అందుకే అస్సాం ప్రభుత్వం సైతం తమ రాష్ట్ర గర్వకారణమైన లచిత్ బోర్ఫుకన్ వీరగాథను ఈ తరం ప్రేక్షకులకు చూపించడానికి ఆదిత్య ధర్ అయితేనే కరెక్ట్ అని భావించింది.

స్టార్ హీరోల డేట్స్ కోసం దర్శకులు లైన్లలో నిల్చునే రోజుల్లో, ఒక రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్‌మార్క్ బయోపిక్ కోసం ఆదిత్య ధర్ రూట్ మ్యాప్ వైపు చూడటం విశేషం. తన బిజీ షెడ్యూల్స్ మార్చుకుని ఆదిత్య ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక ఏదేమైనా, బాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేసి, రియలిస్టిక్ దేశభక్తి చిత్రాలతో గవర్నమెంట్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్ ప్రయాణం నిజంగా అభినందనీయం..