Begin typing your search above and press return to search.

ఆదిత్య 999.. వారసుడు ఫిక్స్..?

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 కథ ఇప్పటికే బాలయ్య పూర్తి చేశారు.

By:  Ramesh Boddu   |   30 July 2025 8:00 PM IST
ఆదిత్య 999.. వారసుడు ఫిక్స్..?
X

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 కథ ఇప్పటికే బాలయ్య పూర్తి చేశారు. ఇన్నేళ్ల సినీ అనుభవం తో బాలకృష్ణ ఆ కథ సిద్ధం చేశారట. ఆదిత్య 369 దాదాపు 3 దశాబ్దాల క్రితమే ఇప్పటి తరాన్ని చూపించి విజువల్ పరంగా సూపర్ అనిపించారు. ఐతే ఇప్పుడు తీస్తున్న ఆదిత్య 999 అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య నో కాంప్రమైజ్..

ఆదిత్య 999 సినిమా విషయంలో బాలయ్య నో కాంప్రమైజ్ అనేస్తున్నాడు. సినిమా డైరెక్షన్ బాధ్యతలను క్రిష్ చేతుల్లో పెట్టారని తెలుస్తుంది. క్రిష్ బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్ టీ ఆర్ బయోపిక్ సినిమాలు చేశారు. ఐతే క్రిష్ అయితేనే ఈ కథకు న్యాయం చేయగలడని బాలయ్య నమ్ముతున్నారు. ఆదిత్య 999 సినిమాలో బాలకృష్ణ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారట.

ఆదిత్య 369 లో ఐకానిక్ రోల్ అయిన శ్రీకృష్ణదేవరాయలు పాత్ర అందులో ఒకటి ఉంటుందని మరో రెండు పాత్రలు కూడా డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. ఇక మరోపక్క నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో నటిస్తాడని టాక్. అసలైతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అనుకున్నారు కానీ అది ఎందుకో సెట్స్ మీదకు వెళ్లలేదు.

వారసుడి తెరంగేట్రం మాత్రం..

ఐతే ఆదిత్య 999 లాంటి సినిమాతో పరిచయం అయితే అలా గుర్తించొఓవచ్చు అనే ఆలోచనతో ఇలా ప్లాన్ చేస్తున్నారట. మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఐతే వారసుడి తెరంగేట్రం మాత్రం జరగట్లేదు. మళ్లీ ఇప్పుడు ఆదిత్య 999 లో నందమూరి వారసుడు ఉంటాడంటూ హడావిడి చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ చాలా అసక్తిగా ఉండగా అది మాత్రం ఎప్పుడు జరుగుతుందో అన్నది చూడాలి. ఐతే కొంతమంది మాత్రం మోక్షజ్ఞ ఛాయిస్ కరెక్టే అంటున్నారు. ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఉంటాడా లేడా అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. ఆదిత్య 999 గోపీచంద్ మూవీ తో పాటుగా క్రిష్ సినిమాను కూడా ఒకేసారి షూటింగ్ చేస్తున్నడట బాలయ్య.