ఇది అమ్మాయిల సమస్య మాత్రమే కాదు.. అనుపమ విషయంలో అదితి షాకింగ్ కామెంట్స్
అయితే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ తెరపైకి వచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Aug 2026 2:01 PM ISTసినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ ఒక్కసారిగా హీటెక్కడం సాధారణమే. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ వంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు అసలు విషయానికంటే ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? అనే డిస్కషనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ తెరపైకి వచ్చింది. అనుపమ కామెంట్స్ పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్ట్ అవుతూ, ఈ అంశాన్ని కేవలం వ్యక్తిగత వ్యవహారంగా కాకుండా, చాలామందికి సంబంధించిన విషయంగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అనుపమ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాన్ని తాను ఇటీవలే తెలుసుకున్నానని చెప్పిన అదితి, అయితే అందులో ఎవరో ఒకరిని కించపరచాలనే ఉద్దేశం తనకు కనిపించలేదని, ఒక వ్యక్తి తన ఎక్స్‌పీరియెన్స్ ను తన కోణంలో చెప్పుకోవడం సహజమేనని ఆమె భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ కు భిన్నంగా అదితి కామెంట్స్ మరో దిశలో డిస్కషన్ కు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా రిలేషన్‌షిప్స్ లో ఎదురయ్యే సమస్యలను కేవలం మహిళల అనుభవాలకే పరిమితం చేయకూడదనే అంశాన్ని అదితి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా తమకు ఎదురవుతున్న పరిస్థితిని వెంటనే గుర్తించలేకపోవచ్చని, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, అసౌకర్యం లేదా ఇబ్బందులను అర్థం చేసుకోవడంలో ఆలస్యం కావచ్చని, అందుకే ఇలాంటి అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల సమస్యలను గుర్తించే అవకాశం పెరుగుతుందని అదితి అభిప్రాయపడ్డారు.
ఇదే ఇప్పుడు ఈ వ్యవహారంలో మెయన్ డిస్కషన్‌గా మారుతోంది. ఒక సెలబ్రిటీ తన పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నప్పుడు దాన్ని కేవలం గాసిప్‌గా చూడాలా? లేక అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ల వెనుక ఉన్న సామాజిక అంశాన్ని కూడా గమనించాలా? అనే ప్రశ్న ముందుకు వస్తోంది. అనుపమ కామెంట్స్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న టైమ్ లో అదితి మాత్రం వ్యక్తిగత ఆరోపణలు, ఊహాగానాల జోలికి వెళ్లకుండా సమస్యను పూర్తిగా వేరే కోణంలో చూడటం విశేషం. అనుపమ చెప్పిన తన ఎక్స్‌పీరియెన్స్ కేవలం ఆమెకు సంబంధించినదైనా.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు సమాజంలో చాలామంది ఉండొచ్చనే విషయాన్ని అదితి కామెంట్స్ గుర్తు చేస్తున్నాయి.
