Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌య రెండు చోట్లా డెడ్ స్లో!

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ ఇండ‌స్ట్రీకి స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చింది. తొలి సినిమా `వీరూమాన్` మంచి విజ‌యం అందుకుంది.

By:  Srikanth Kontham   |   28 Dec 2025 6:00 PM IST
స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌య రెండు చోట్లా డెడ్ స్లో!
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ ఇండ‌స్ట్రీకి స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చింది. తొలి సినిమా `వీరూమాన్` మంచి విజ‌యం అందుకుంది. అటుపై `మావీరున్` తోనూ మరో స‌క్సెస్ అందుకుంది. ఇలా ఆరంభంలోనే బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాలు అందుకోవ‌డంతో? అదితి శంక‌ర్ పేరు కోలీవుడ్ లో జోరుగా మారు మ్రోగింది. కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మైంది. రెండు విజ‌యాలున్నా? 2024 లో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. 2025 లో మాత్రం `నెస్సీపాయ` అనే చిత్రంలో న‌టించింది.

దీంతో పాటు `భైర‌వం` సినిమాతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఈ ఏడాదిలో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో నిలిచింది. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ స్పీడ్ ఎలా ఉంది? అండే డెడ్ స్లోగానే క‌నిపిస్తోంది. `ఒన్స్ మోర్` అనే త‌మిళ సినిమాలో న‌టిస్తోంది. ఇది మిన‌హా కొత్త సినిమాలు వేటికీ క‌మిట్ అవ్వ‌లేదు. ఈ అమ్మ‌డి గురించి సోర్సెస్ ఏం చెబుతున్నాయంటే? అదితి కి అవ‌కాశాలు రాలేద‌ని కొంత‌మంది అంటే? వ‌చ్చిన వాటిని వ‌ద‌లుకుంటోంది అన్న‌ది మ‌రి కొంత మంది వాద‌న‌.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు అదితి రిజెక్ట్ చేస్తుందా? అంటే అలాంటిదేమీ లేద‌ని పాత్ర అవ‌స‌రాన్ని బ‌ట్టి తాను మౌల్డ్ అవుతాన‌ని చెబుతుందిట‌. అలాగ‌ని శ్రుత‌మించిన అందాల ఆర‌బోత‌కు మాత్రం తానెప్పుడు సిద్దం కాన‌నే సంకేతాలు స్ప‌ష్టంగా ఇచ్చేస్తుందిట‌. స‌న్నివేశాల ప‌రంగా అస‌వ‌రం మేర మాత్ర‌మే అందంగా క‌నిపించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ కండీష‌న్లకు లోప‌డి కోలీవుడ్, టాలీవుడ్ లో కొత్త అవ‌కాశాలు అందుకుం టుందా? లేదా? అన్న‌ది చూడాలి. శంక‌ర్ అంటే డైరెక్ట‌ర్ గా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. కానీ కొంత కాలంగా అత‌డు వైఫల్యాల్లోనే కొన‌సాగుతున్నారు.

భారీ బ‌డ్జెట్ చిత్రాలేవి క‌లిసి రావ‌డం లేదు. పూర్తి చేసిన `ఇండియన్ 3` కూడా రిలీజ్ అవ్వ‌డం లేదంటే? అత‌డి ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది అంచ‌నా వేయోచ్చు. డాడ్ ఇమేజ్ కూడా శంక‌ర్ పై ప‌డుతుందా? అంటే నో అనే చెప్పా లి. అదితి వైఫ‌ల్యాల‌తో డాడ్ కి ఎలాంటి సంబంధం లేదు. అస‌లు అదితి సినిమాల్లోకి రావ‌డం శంక‌ర్ కి ఆస‌క్తి కూడా లేదు. అదితి ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చే ముందే? త‌న నుంచి ఎలాంటి స‌హ‌కారం ఉండ‌ద‌ని..తన అవ‌కాశాలు తానే సృష్టించుకోవాల‌ని శంక‌ర్ ముందే కండీష‌న్ పెట్టారు. డాడ్ కండీష‌న్ కు లోబ‌డే అదితి ప‌ని చేస్తొంది.