అదితీరావ్ పేరుతో మోసగాడి వాట్సాప్ వల
తనదైన అందం ఛమత్కారమైన నటనతో యువతరం హృదయాలను గెలుచుకున్న అదితీరావ్ హైదరీ తాను వలచిన సిద్ధార్థ్ ని పెళ్లాడి సంసార ఆస్వాధనలో ఉన్న సంగతి తెలిసినదే.
By: Sivaji Kontham | 16 Nov 2025 11:40 PM ISTతనదైన అందం ఛమత్కారమైన నటనతో యువతరం హృదయాలను గెలుచుకున్న అదితీరావ్ హైదరీ తాను వలచిన సిద్ధార్థ్ ని పెళ్లాడి సంసార ఆస్వాధనలో ఉన్న సంగతి తెలిసినదే. అదితీ ఇంతకముందు హీరామండిలో అద్భుత నటనతో కట్టి పడేసింది. వేశ్య పాత్రలో గజగామిని నడకలతో యూత్ గుండెల్ని కోతకు గురి చేసిన ఈ బ్యూటీని ఒక మోసగాడు స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం మిస్ యూజ్ చేస్తున్నాడని ఆరోపించింది.
అతడు నాలాగా నటిస్తున్నాడు. నమ్మకండి..అది నా వాట్సాప్ కాదు! అని అదితీ ఆందోళన వ్యక్తం చేసారు. నాలాగా నటిస్తున్న వాట్సాప్ ఫేక్ బోయ్ ఎవరో తెలీదని అన్నారు. అతడి వివరాలతో పాటు ఒక నోట్‌ను షేర్ చేసింది. ''కొందరు నా దృష్టికి తెచ్చారు.. ఎవరో వాట్సాప్‌లో నాలాగా నటిస్తూ, నా ఫోటోలను ఉపయోగించి 'ఫోటోషూట్'ల గురించి ఫోటోగ్రాఫర్‌లకు మెసేజ్‌లు పంపుతున్నాడు. అది నేను కాదు. నేను ఇలా సంప్రదించను. పని కోసం ఏ వ్యక్తిగత నంబర్‌ను ఉపయోగించను. ప్రతిదీ నా టీమ్ చూసుకుంటుంది'' అని అన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని, ఆ నంబర్ ని నమ్మకండి! అని కూడా హెచ్చరించారు. మీకు ఏదైనా వింతగా అనిపిస్తే, నా టీమ్‌కి వెంటనే తెలియజేయండి. నాకు మద్దతుగా రక్షణాత్మకంగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు! అని నోట్ లో రాసారు.
అయితే ఈ పోస్ట్‌పై స్పందించిన సహచర నటి కుషా కపిల ''అయినా మీ గజగామిని నడకను కాపీ చేయలేరు'' అని రాసారు. మీ ఇన్‌స్టాగ్రామ్ డిపిని ఉపయోగించి వారు ఏమీ చేయలేరు! అని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని కూడా నటి కుషా కపిల జోడించారు.
అదితీరావ్ హైదరీ హైదరాబాదీ అమ్మాయి. అందువల్ల ఈ నవాబుల అమ్మాయిని పెళ్లాడిన సిద్ధార్థ్ కూడా హైదరాబాద్ అల్లుడయ్యాడు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్య దాంపత్యం, రొమాంటిక్ లైఫ్ అన్నివేళలా చర్చనీయాంశమైంది. అదితీ రావ్ తల్లిదండ్రులు హైదరాబాద్, దిల్లీతో అనుబంధం కలిగి ఉన్నారు. అదితీ తెలుగు, తమిళం, హిందీలో ప్రముఖ కథానాయికగా వెలిగిపోతోంది. లైనెస్, పరివారిక్ మనురాంజన్ అనే రెండు చిత్రాలతో అతిదీ బిజీగా ఉంది.
