Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్‌తో ప్రయాణం పై ఆసక్తికర విషయాలు!

క్యూట్ కపుల్‌గా అదితి రావు హైదరి- సిద్ధార్థ్‌ల బంధం గురించి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి క‌నిపిస్తుంది. ఈ జంట వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా, సాదాసీదాగా గడపడానికే ఇష్టపడతారు.

By:  Srikanth Kontham   |   16 May 2026 5:00 PM IST
సిద్ధార్థ్‌తో ప్రయాణం పై ఆసక్తికర విషయాలు!
X

క్యూట్ కపుల్‌గా అదితి రావు హైదరి- సిద్ధార్థ్‌ల బంధం గురించి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి క‌నిపిస్తుంది. ఈ జంట వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా, సాదాసీదాగా గడపడానికే ఇష్టపడతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి, సిద్ధార్థ్‌తో తనకున్న అనుబంధం, ప్రేమ , జీవిత భాగస్వామ్యం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే నిజమైన బంధం దాగి ఉందంటూ ఎంతో పరిణతితో మాట్లాడారు. ప్రేమ అనేది ఒకరినొకరు ఇష్టపడటమే కాదు. ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని..వారి ఆలోచనలను గౌరవించడం.

సిద్ధార్థ్‌తో తనకున్న బంధం భార్యాభర్తల బంధం మాత్రమే కాదని అంతకంటే మిన్నగా మంచి స్నేహం , సమతుల్యమైన భాగస్వామ్యం ఉంద‌ని పేర్కొన్నారు. తామిద్దరం ఒకే వృత్తిలో ఉన్నా? వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి సాధారణ వ్యక్తుల్లాగే సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. సిద్ధార్థ్ వ్యక్తిత్వం గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. సిద్దార్ద్ ఎంతో స్పష్టమైన ఆలోచనలు గల వ్యక్తి. జీవితంలోని ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా విశ్లేషిస్తాడు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు వెన్నుదన్నుగా నిల‌బ‌డుతుంటాం. ఇలా మెల‌గ‌డం అన్న‌ది ఆరోగ్యకరమైన బంధానికి పునాది గా చెప్పొచ్చు.

తమ ప్రయాణంలో ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా కెరీర్ పరంగా వచ్చే ఒడిదుడుకులను కూడా ఇద్దరం కలిసి ఎదుర్కొంటామని విశ్వాసాన్ని వ్య‌క్తం చేసారు. వృత్తిపరమైన జీవితం- వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం గురించి అదితి తనదైన శైలిలో స్పందించారు. నటీనటులుగా నిరంతరం షూటింగులు, ప్రయాణాలతో బిజీగా ఉన్నా? ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం, ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం బంధాన్ని మరింత దృఢంగా మార్చిందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఇద్ద‌రు ఎవ‌రి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నా? సోషల్ మీడియాలో పరస్పరం మద్దతు ఇచ్చుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఎక్కడా అతి ప్రదర్శన లేకుండా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకుంటూనే హుందాగా వ్యవహరించడం ఈ జంట ప్రత్యేకత. అదితి పంచుకున్న ఈ విషయాలు ఆదర్శవంతమైన బంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అదితి రావు హైదరి మాటలను బట్టి చూస్తే.. విజయవంతమైన జీవిత భాగస్వామ్యానికి పరస్పర గౌరవం, నమ్మకం ఎంత అవసరమో అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బంధాలు త్వరగా బీటలు వారుతోన్న తరుణంలో సిద్ధార్థ్-అదితిల అనుబంధం ఎంతోమందికి మంచి స్ఫూర్తిని ఇస్తుంది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ కెరీర్‌లోనూ వ్యక్తిగత జీవితంలోనూ జంట ఇలాగే మున్ముందుకూ సాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.