Begin typing your search above and press return to search.

గుర్తుండి పోవాలంటే ఈ 'లస్ట్‌' చేయాలి అదితి..?

అయితే టైటిల్‌కి తగ్గట్లుగానే ఎపిసోడ్‌లో కాస్త లస్ట్‌ ఎక్కువ అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Ramesh Palla   |   21 Sept 2026 11:30 AM IST
గుర్తుండి పోవాలంటే ఈ లస్ట్‌ చేయాలి అదితి..?
X

ఇండియన్‌ యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌ 'లస్ట్‌ స్టోరీస్‌' మూడవ సీజన్‌ తాజాగా స్ట్రీమింగ్‌ ప్రారంభం అయింది. మొదటి రెండు సీజన్‌లకు వచ్చిన రెస్పాన్స్‌ నేపథ్యంలో మూడో సీజన్‌ను అంతకు మించి అన్నట్లు ఉండే విధంగా ప్లాన్‌ చేసినట్లుగా ఉంది. అందుకే ఈసారి లస్ట్ స్టోరీస్ గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నాలుగు కథలను తీసుకుని ఈసారి లస్ట్‌ స్టోరీస్ 3 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. అందులో ఒక కథలో సౌత్‌ హీరోయిన్‌ అదితి రావు హైదరి, సిద్దార్థ్‌ నటించారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి సారి స్క్రీన్‌ మీద కనిపించిన నేపథ్యంలో వారి అభిమానులు ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే టైటిల్‌కి తగ్గట్లుగానే ఎపిసోడ్‌లో కాస్త లస్ట్‌ ఎక్కువ అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదితి నుంచి ఇది తాము ఊహించలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

అదితి రావు హైదరి, సిద్దార్థ్‌ల రొమాన్స్‌...

సోషల్‌ మీడియాలో కొందరు అదితి రావు హైదరి, సిద్దార్థ్‌కు సంబంధించిన బెడ్‌ సీన్స్ వీడియోలను షేర్‌ చేయడం ద్వారా చాలా మంది తప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎపిసోడ్‌ మొత్తం చూస్తే అసలు విషయం అర్థం అవుతుందని కొందరు అంటున్నారు. మిగిలిన మూడు ఎపిసోడ్స్‌తో పోల్చితే సిద్దార్థ్‌, అదితి రావు హైదరి యొక్క ఎపిసోడ్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. వీరు రియల్‌ కపుల్‌ కావడంతో రీల్‌ రొమాన్స్‌ ను మరో లెవల్‌ కి తీసుకు వెళ్లినట్లుగా అనిపిస్తుందని కొందరు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి కాంబో సీన్స్‌, ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్ చాలా బాగుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ తో లస్ట్‌ స్టోరీస్ 3 సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని అప్పుడే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో వీరి ఎపిసోడ్‌ వీడియో బిట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

లస్ట్‌ స్టోరీస్‌ 3 లో...

ఈ సమయంలో అదితి రావు హైదరి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదితి తెరపై కనిపించి చాలా కాలం అయింది. సినిమాలకు కమిట్‌ అయ్యి దాదాపు నాలుగు ఏళ్లు అవుతుంది. ఇక వెబ్‌ సిరీస్ హీరమండితో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు అదితి నుంచి కొత్త ప్రాజెక్ట్‌ రాకపోవడంతో మొన్నటి వరకు ఆమె అభిమానులు ఎందుకు ఇంత ఆలస్యం అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అదితి రావు మాట్లాడుతూ తాను వ్యక్తిగత కారణాల వల్ల బ్రేక్‌ తీసుకోలేదు. మంచి కథ రాకపోవడం వల్ల బ్రేక్ వచ్చింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలి, ఎప్పుడు చెప్పుకునే కథల్లో నటించాలని కోరుకుంటున్నాను అని, అందుకే కాస్త ఆలస్యం అయినా మంచి కథల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

అదితి రావు హైదరిపై ట్రోల్స్‌...

అప్పుడు అదితి ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేయాలని, ఎప్పుడు చెప్పుకునే కథలో నటించాలని చెప్పి ఇప్పుడు 'లస్ట్‌ స్టోరీస్‌' తో రావడం ఏంటో అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లస్ట్‌ స్టోరీస్‌ లో అదితి నటించడంను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. భర్త సిద్దార్థ్‌తో కనుక పర్వాలేదు అనుకుందేమో కానీ, ఆమెను జనాలు ఆ పాత్రలో, ఆ స్టోరీస్‌లో చూడలేక పోతున్నామని అంటున్నారు. ఈ సమయంలోనే కొందరు అదితి కోరుకున్నట్లుగానే కెరీర్‌ మొత్తం గుర్తుండి పోయే పాత్రను లస్ట్‌ స్టోరీస్‌ 3 లో చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఎప్పటికీ గుర్తుండి పోతుంది, కానీ ఎప్పుడు గుర్తుకు వచ్చినా ఆమెను ఫ్యాన్స్‌, ప్రేక్షకులు విమర్శించే విధంగా లస్ట్‌ పాత్ర ఉందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కి అదితి రావు, సిద్దార్థ్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.