Begin typing your search above and press return to search.

'ల‌స్ట్ స్టోరీస్- 3' తో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న హైద‌రాబాదీ బ్యూటీ

ఈ నేపథ్యంలో అదితీరావ్ నటిస్తున్న ఆంథాలజీ సిరీస్ `లస్ట్ స్టోరీస్ 3`పైనే అదితీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

By:  Sivaji Kontham   |   19 Sept 2026 1:00 AM IST
ల‌స్ట్ స్టోరీస్- 3 తో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న హైద‌రాబాదీ బ్యూటీ
X

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన యూనిక్ క్వాలిటీస్.. అందం- అభినయంతో కట్టిపడేస్తున్న హైదరాబాదీ అమ్మాయి అదితి రావు హైదరి మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగులో సరైన అవకాశాలు లేక.. కోలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతోంద‌నే గుస‌గుస‌ నడుస్తున్న తరుణంలో తన దృష్టిని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌లపై కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో అదితీరావ్ నటిస్తున్న ఆంథాలజీ సిరీస్ `లస్ట్ స్టోరీస్ 3`పైనే అదితీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.




నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `లస్ట్ స్టోరీస్ 3` సిరీస్ ద్వారా అదితి రావు మరోసారి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఆంథాలజీలో త‌న‌ నటనకు సంబంధించిన ప్రత్యేకతలు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కదేల్ రివ్యూలో వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌లో అదితి రావు హైదరి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మాయ చేయబోతోంద‌ని తెలుస్తోంది.




ఈ సిరీస్‌లోని ఇత‌ర‌ విభాగాలలో కొంకణ సేన్ శర్మ, రాధిక ఆప్టే, అలీ ఫజల్, రాధికా మదన్ వంటి టాలెంటెడ్ నటీనటులతో పాటు అదితి రావు కూడా కీలక పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వచ్చిన రివ్యూల ప్రకారం.. ఈ ఆంథాలజీలో అదితి రావు క‌ళ్లు చెదిరే ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.




`లస్ట్ స్టోరీస్ 3`లో అదితి రావు తన పాత్రతో తెరపై చక్కటి ఆహ్లాదాన్ని పంచనుంది. అదితీ తన నటనలో చూపిన చక్కటి ఆకర్షణ - అమాయకత్వం- కొంటెతనం ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కథ డిమాండ్ మేరకు అదితీ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని రివ్యూలు పేర్కొంటున్నాయి.




తెలుగు, తమిళ పరిశ్రమలతో పాటు హిందీలోనూ విభిన్న ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అదితీరావు కెరీర్‌లో `లస్ట్ స్టోరీస్ 3` ఒక మైలురాయిగా నిలవనుంది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి తన సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ బ్యూటీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో డిజిటల్ స్పేస్‌లో మరోసారి తన సత్తా చాటడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.