ఫోటో స్టోరి: అదితీరావ్.. నియాన్ కాంతుల ధగధగ
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేదికపై భారతీయ అందాల తారలు తమ గ్లామర్‌తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
By: Sivaji Kontham | 18 May 2026 9:10 AM ISTప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేదికపై భారతీయ అందాల తారలు తమ గ్లామర్‌తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాలీవుడ్ భామలు ఆలియా భట్, హ్యూమా ఖురేషీలతో పాటు గ్లోబల్ స్టేజ్‌పై మెరిసిన మన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ బ్యూటీ అదితీరావ్ హైదరీ ఈసారి సరికొత్త రికార్డు సృష్టించారు. కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఈ బ్యూటీ అడుగుపెట్టిన శైలి, ధరించిన కాస్ట్యూమ్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ఈ మెయిన్ గాలా ఈవెంట్‌కు ముందే అదితీరావ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో నియాన్ కాంతుల ధగధగలను తలపిస్తూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కాన్స్ అధికారిక రెడ్ కార్పెట్ వాక్ కోసం అదితీరావ్ హైదరీ ఎవరూ ఊహించని విధంగా ఒక బ్రైట్ నియాన్ గ్రీన్ సిల్క్-జార్జెట్ గౌన్‌ను ఎంపిక చేసుకున్నారు. థై-హై స్లిట్ లుక్.. వెనుక వైపు నుండి పొడవుగా నేలను తాకుతూ సాగిపోయే లాంగ్ కేప్‌తో డిజైన్ చేసిన ఈ మోడ్రన్ డ్రెస్ అదితీకి ఒక సరికొత్త రాయల్ అప్పీల్‌ను ఇచ్చింది. ఫెస్టివల్ లైట్ల కాంతుల్లో అదితీ నడుచుకుంటూ వస్తుంటే.. మోడ్రన్ డ్రామా ఎలివేషన్ ఉన్న ఒక శిల్పంలా కనిపించారంటూ ఫ్యాషన్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నియాన్ గ్రీన్ గౌన్‌కు జోడిగా అదితీరావ్ తన మేకప్ -యాక్సెసరీస్ విషయంలో చాలా సింపుల్ అప్రోచ్ తో ఆకట్టుకుంది. న్యూడ్-టోన్డ్ మేకప్, కాంతివంతమైన గ్లామ్ లుక్‌తో అలరించింది. ఇంతకుముందు అదితీ కాన్స్ వేదికపై మన భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఒక అందమైన శారీ లుక్‌లో కూడా మెరిశారు. ఒక క్లాసిక్ చీర, బోల్డ్ చోకర్ నెక్లెస్, అల్లికల జుట్టు.. చాలా లైట్ మేకప్‌తో అదితీ ఫోటోషూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ ఫోటోలకు అదితీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన క్యాప్షన్.. ``చీర కట్టడం.. సాంప్రదాయ పద్ధతిలో. ఇది విప్లవాత్మకమైనదని నాకు తెలుసు`` అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
అదితీరావ్ హైదరీ రెండు భిన్నమైన లుక్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ఈ బ్యూటీ స్టైలింగ్‌ను చూసి ముగ్ధులవుతూ.. ``ఫైనల్‌గా ఒకరు చీర కట్టుకు సరైన న్యాయం చేశారు`` అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అభిమానులు స్టన్నింగ్, ఓ మై గాడ్.. మీ లుక్ ఈ రోజును కాపాడింది.. అంటూ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. గ్లోబల్ వేదికలపై వెస్ట్రన్ డ్రెస్సులతో పాటు మన దేశీ సంస్కృతిని కూడా అంతే హుందాగా ప్రదర్శించడంలో అదితీ స్టైల్ ఎప్పుడూ స్పెషల్ అని ఈ కాన్స్ వేడుకలు మరోసారి నిరూపించాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అదితీరావ్ హైదరీ చివరగా కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలతో కలిసి `గాంధీ టాక్స్` అనే చిత్రంలో నటించారు. లయోనెస్ అనే చిత్రంలోను నటిస్తోంది. అలాగే ఇంతియాజ్ అలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రొమాంటిక్ సిరీస్ `ఓ సాథీ రే` లోను నటించింది ఈ సిరీస్‌తో పాటు పలు భారీ ప్రాజెక్టులతో అదితీ కెరీర్ పరంగాను అలాగే గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా సరికొత్త మైలురాళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది.
