Begin typing your search above and press return to search.

మళ్లీ వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్‌ అవుతాయో ఊహించడం కష్టం. కొన్ని సార్లు సెలబ్రిటీలు చిన్న విషయాన్ని గురించి మాట్లాడినా ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవుతాయి.

By:  Ramesh Palla   |   1 Sept 2025 5:00 PM IST
మళ్లీ వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
X

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్‌ అవుతాయో ఊహించడం కష్టం. కొన్ని సార్లు సెలబ్రిటీలు చిన్న విషయాన్ని గురించి మాట్లాడినా ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవుతాయి. ఎలాంటి వివాదం లేకున్నా కూడా కొన్ని సార్లు ఆ వ్యాఖ్యలను వివాదాస్పదం చేసే విధంగా వైరల్‌ అవుతాయి. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్‌ పొరపాటున అన్న మాటలు వైరల్‌ అయ్యాయి. కొన్ని సార్లు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఎంతో మంది హీరోలు హీరోయిన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక వ్యాఖ్య కారణంగా వైరల్‌ కావడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే వారు చేసిన వ్యాఖ్యలు నెలలు దాటిన తర్వాత వైరల్‌ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదితి రావు హైదరి విషయంలో ఇలాగే జరుగుతోంది.

మర్డర్ 3 ప్రమోషన్‌లో..

2013లో వచ్చిన మర్డర్‌ 3 సినిమా సమయంలో అదితి రావు హైదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎందుకు వెలుగులోకి వచ్చాయి అని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సోషల్‌ మీడియా ఈ స్థాయిలో లేదని చెప్పాలి. అందుకే అప్పుడు అదితి చేసిన వ్యాఖ్యల ఇంపాక్ట్‌ ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యాఖ్యలను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొందరు ఆ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందిస్తూ ఉంటే, కొందరు మాత్రం అదితి యొక్క అహంకారపు వ్యాఖ్యలు అంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి చాలా రకాలుగా అదితి రావు హైదరి వ్యాఖ్యలను ట్రోల్‌ చేసిన వారు ఉన్నారు.

మల్లికా షెరావత్‌ గురించి..

ఇంతకు మర్డర్‌ 3 సినిమా ప్రమోషన్‌ సమయంలో అదితి రావు హైదరీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... మనిషికి నిజమైన బలం ఛాతిలో ఉండే సిలికాన్ కాదు, ఆత్మలో ఉండే ఉక్కు వల్ల లభిస్తుందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మల్లికా షెరావత్ యొక్క సర్జరీ గురించి ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా మర్డర్ సినిమాకు మల్లికా షెరావత్‌కి సంబంధాలు ఉన్నాయి. దాంతో అదితి రావు ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మల్లికా గురించే అంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. అప్పుడు పెద్దగా పట్టించుకోకున్నా ఇప్పుడు ఆ వ్యాఖ్యలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసి మరీ అదితి రావు హైదరినీ నెటిజన్స్ ట్రోల్‌ చేస్తున్నారు. ఒక మహిళ అయ్యి ఉండి మరో మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదితి రావు హైదరి వ్యాఖ్యలపై స్పందించేనా?

ప్రస్తుతం హీరోయిన్స్‌లో మెజార్టీ శాతం హీరోయిన్స్ ఏదో ఒక రకమైన కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్లినంత ఈజీగా కాస్మోటిక్‌ సర్జరీలకు వెళ్తున్నారు. ఎక్కువ ప్రమాదం కాదు, చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయిదు.. పది సార్లు కూడా కాస్మోటిక్‌ సర్జరీకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారు తమ అందం తమ ఇష్టం అంటున్నారు. శరీరంలోని ఏ భాగం అందంగా లేకున్నా, అందంగా కనిపించాలన్నా ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాలి. అందులో తప్పు లేదు, అలా చేయడం నేరం, ఘోరం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అయితే చాలా ఏళ్ల క్రితం అదితి రావు హైదరి ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు ఆమె అభిప్రాయం ఏమైనా మారిందా అనేది చూడాలి. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై అదితి స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.