'ఆదర్శ కుటుంబం' లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా..? ఆ ఒక్క సీన్ కి షాక్ అవ్వాల్సిందేనా...
మొత్తానికైతే టీజర్లలో సినిమాను ఫ్యామిలీ కామెడీ డ్రామాగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.
By: Gopi Velupala | 4 Oct 2026 10:37 AM ISTప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఏ భాషలో ఎవరు సినిమా చేసినా కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒకవేళ పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వకపోయిన ఓటిటి లో పలు భాషల్లో డబ్ చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు... మరి ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం వెంకటేష్ తో చేసిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ఈనెల తొమ్మిదోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాను ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కించారు. వెంకటేష్ ఫ్యామిలీ స్టోరీ తో వచ్చిన ప్రతిసారి సక్సెస్ ను సాధిస్తాడనే ట్రాక్ రికార్డు అయితే ఉంది. వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే అందులో నవ్వులు పూయించడం కాయం అంటూ ప్రేక్షకులందరు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ ఈ సినిమాలో ప్రేక్షకుడి అంచనాలకు మించి సినిమాను తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే టీజర్లలో సినిమాను ఫ్యామిలీ కామెడీ డ్రామాగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఆ ఫ్యామిలీకి ఒక అనుకోని ఇబ్బంది అయితే ఎదురవుతుందట. అందులో ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అయ్యారు. మొత్తానికైతే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. దీనిని కామెడీ సినిమాగా ప్రమోట్ చేస్తున్నప్పటికి మొత్తానికైతే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయట. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయంటూ మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి...
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఒక యాక్షన్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. తన ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో పడినప్పుడు వెంకటేష్ వచ్చి చేసే యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులందరిని ఉర్రూతలూగిస్తుందట దానికి ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడట. ఆ ఒక్క సీన్లో ప్రేక్షకులను కొద్దిసేపు ఉత్కంఠకు గురి చేస్తూనే అందులో సస్పెన్స్ ను బిల్డ్ చేసి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా ఆడ్ చేసి ఫైట్ సీక్వెన్స్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఒక 15 నిమిషాల పాటు సాగే ఎపిసోడ్ గా తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశం కోసం ప్రేక్షకులు రిపిటెడ్ గా థియేటర్ కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈనెల 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో వెంకటేష్ మరోసారి 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడతాడా? గత సంవత్సరం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఈ మూవీ తో అంతకు మించిన సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది...
