గురూజీ.. ఇంకాస్త ఎక్కువ చేస్తే తప్పేంటి!
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఆటోమేటిక్ గా బజ్ వచ్చేస్తుంది. కానీ ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం సీన్ కాస్త రివర్స్ లో ఉంది.
By: M Prashanth | 9 Oct 2026 10:32 AM ISTవెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఆటోమేటిక్ గా బజ్ వచ్చేస్తుంది. కానీ ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం సీన్ కాస్త రివర్స్ లో ఉంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, పోస్టర్లు, పాటలు జనాల్లో అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల రిలీజ్ వాయిదా పడిందని మేకర్స్ చెబుతున్నారు. అయితే పనులు ఆలస్యం అవ్వడం వేరు, ఆడియన్స్ లో సినిమా మీద సరైన హైప్ లేకపోవడం వేరు. కరెక్ట్ గా రిలీజ్ కు ముందు సినిమాకు ఈ హైప్ మిస్ అవుతోందన్న ఫీలింగ్ ఇండస్ట్రీలో కనిపించింది.
నిజానికి గురూజీ మాటలకు బయట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టేజ్ మీద ఒక చిన్న పంచ్ వేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటప్పుడు తన సినిమా కోసం ఆయన కాస్త యాక్టివ్ గా ప్రమోషన్స్ లోకి దిగితే ఆ బజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఏదో యాంకర్ సుమ తో ఒక ఇంటర్వ్యూ లేదంటే టెక్నిషియన్స్ తో మరో ఇంటర్వ్యూ అనేది రొటీన్ పద్ధతి. దానికి ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ కోసం సందీప్ వంగా, అనిల్ రావిపూడి లాంటి వాళ్లతో స్పెషల్ ఇంటర్వ్యూలు చేశారు. యూట్యూబ్ ఛానళ్లు, మీమ్ పేజీల వరకు వెళ్లి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. కంటెంట్ ఎంత గొప్పదైనా ప్రమోషన్స్ తో ఆడియన్స్ కు చేరువ కావడం చాలా అవసరం. ఇదే విషయంలో అనిల్ రావిపూడి స్టైల్ భలే సెట్ అవుతుంది. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే హీరోలతో సరదా వీడియోలు, సెట్స్ లో అప్డేట్స్ ఇస్తూ జనాన్ని ఎంగేజ్ చేస్తారు.
ఆదర్శ కుటుంబం కూడా పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి వెంకీతో కలిసి త్రివిక్రమ్ ఒక క్యాజువల్ చిట్ చాట్ చేసినా చాలు. సెట్స్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ పంచుకుంటే సినిమాకు విపరీతమైన కనెక్ట్ దొరుకుతుంది. ఇలాంటి ట్రెండీ ప్రమోషన్స్ చేస్తే గురూజీ స్థాయి ఏమాత్రం తగ్గదు సరికదా నేటి జనరేషన్ కు ఆయన ఇంకాస్త దగ్గరవుతారు.
సినిమా కంటెంట్ బాగుంటే రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తో దానంతట అదే ఆడుతుంది. కానీ ఫస్ట్ డే థియేటర్ల దగ్గర హంగామా కనిపించాలంటే మాత్రం ముందే జనాల్లో క్యూరియాసిటీ పెంచాలి. ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్ కు సరిగ్గా ఇక్కడే గ్యాప్ కనిపిస్తోంది. బయట ఫంక్షన్లలో తన మాటల గారడీతో ఎంతో అటెన్షన్ తెచ్చే త్రివిక్రమ్, ఇప్పుడు తన సినిమా ప్రమోషన్స్ కోసం కొంచెం ఓపెన్ అయితే బాగుంటుంది. అప్పుడు మేకర్స్ కూడా బజ్ కోసం కష్టపడాల్సిన అవసరం అస్సలు ఉండదు.
