Begin typing your search above and press return to search.

ఆద‌ర్శ కుటుంబం.. పెద్ద దెబ్బే

వెంకీ మూవీ వ‌స్తోందంటే త‌న అభిమాని శ్రీ విష్ణు కామ్రేడ్ క‌ళ్యాణ్ పోటీ నుంచి త‌ప్పుకునేవాడేమో. ఒక‌వేళ ఆ సినిమా ఉన్నా ఇబ్బంది ఉండేది కాదు.

By:  Garuda Media   |   20 Oct 2026 11:27 AM IST
ఆద‌ర్శ కుటుంబం.. పెద్ద దెబ్బే
X

అక్టోబ‌రు 9న ఆద‌ర్శ కుటుంబం సినిమా రాక‌పోవ‌డం పండ‌క్కి ఫ్యామిలీ మూవీ చూసి ఎంజాయ్ చేయాల‌నుకున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత నిరాశ క‌లిగించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్రేక్ష‌కుల కోణాన్ని ప‌క్క‌న పెడితే.. ఆ డేట్‌కు సినిమాను తీసుకురాలేక‌పోవ‌డం ఇటు నిర్మాత‌లు, అటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు పెద్ద దెబ్బే. అప్ప‌టికి పెద్ద పోటీ లేకుండా సినిమా రిలీజ‌య్యేది.

వెంకీ మూవీ వ‌స్తోందంటే త‌న అభిమాని శ్రీ విష్ణు కామ్రేడ్ క‌ళ్యాణ్ పోటీ నుంచి త‌ప్పుకునేవాడేమో. ఒక‌వేళ ఆ సినిమా ఉన్నా ఇబ్బంది ఉండేది కాదు. ఆద‌ర్శ కుటుంబం ఓ మోస్త‌రుగా ఉన్నాస‌రే.. ద‌స‌రా సెల‌వుల్లో ఈ చిత్ర‌మే ప్రేక్ష‌కుల‌కు ఫ‌స్ట్ ప్రయారిటీ అయ్యేది. సినిమాకు మూడు వారాల విండో ఉండేది. లాంగ్ ర‌న్‌తో సినిమా ఊహించ‌ని రేంజికి వెళ్లేది.

కానీ అక్టోబ‌రు 9 నుంచి వాయిదా ప‌డి ఇప్పుడు 30వ తేదీకి షెడ్యూల్ అయిందీ సినిమా. ఇంకా అధికారికంగా డేట్ ప్ర‌క‌టించ‌లేదు కానీ.. 30న సినిమా రావ‌డం ఖాయ‌మే. ఐతే వెంకీ, త్రివిక్ర‌మ్ మూవీ వ‌స్తున్నా స‌రే.. ఆ వీకెండ్‌కు షెడ్యూల్ అయిన వేరే సినిమాలు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌ట్లేదు. అందుకు ఓటీటీ డీల్స్ స‌హా వేరే కార‌ణాలుండొచ్చు. విశ్వ‌క్సేన్ మూవీ క‌ల్ట్‌కు యూత్‌లో క్రేజుంది.

ఇంకా ఇట్లు అర్జున‌, స‌మ్మ‌ర్ హాలిడేస్ సినిమాలు రాబోతున్నాయి. త‌ర్వాతి వారం దీపావ‌ళి వీకెండ్లో రామాయ‌ణంతో పాటు సూర్య సినిమా సీన్ రాబోతున్నాయి. ఇన్ని రిలీజ్‌లు ఉండ‌డం ఆద‌ర్శ కుటుంబంకి ఇబ్బందిక‌ర‌మే. థియేట‌ర్లు పంచుకోవాలి. పైగా ప్రేక్ష‌కుల‌కు ఆప్ష‌న్స్ ఎక్కువుండ‌డం వ‌ల్ల టాక్ కొంచెం అటు ఇటు అయినా క‌ష్ట‌మే. మొత్తానికి జాక్‌పాట్ లాంటి అక్టోబ‌రు 9 డేట్‌ను వ‌దిలేసి.. 30కి సినిమా రావ‌డంతో ఇబ్బంది త‌ప్పేలా లేదు.