వెంకీ చేతిలో బ్యాగ్ మల్లీశ్వరి 2.0!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` గా ఖరారైన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 11 Dec 2025 4:00 PM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` గా ఖరారైన సంగతి తెలిసిందే. టైటిల్ ని బట్టే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ అని కన్పమ్ అయింది. ఇద్దరి కాంబినేషన్ లో ఇలాంటి సినిమానే ఉంటుందని ముందు నుంచి మీడియాలో కథనాలొస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి నిజమయ్యాయి. ఫ్యామిలీ కథల్లో వెంకీ పాత్రలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ఆహ్లాదంగా సరదాగా సాగిపోతుంటాయి. ఈ కాంబినేషన్ లో సీన్స్ ఎలా ఉంటాయి? డైలాగులు ఎలా ఉంటాయి? అన్నది `మళ్లీశ్వరి`తో అందిరికీ తెలిసిందే.
మల్లీశ్వరి కథలోకి వెళ్లాల్సిందే:
కాకపోతే ఆసినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా మాత్రమే పని చేసారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే? మల్లీశ్వరికీ సీక్వెల్లా? అన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. సీక్వెల్ కాకపోయినా? అలాంటి నేపథ్యమున్న కథతోనే సినిమా తీస్తారు? అని బలమైన నమ్మకం అభిమానుల్లో నెలకొంది. నిన్నటి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనూ క్లియర్ అయింది. ఈ పోస్టర్ లో వెంకటేష్ డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. చేతిలో ఓ నల్లటి బ్యాగ్ కనిపిస్తుంది. మరి ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏంటి? మల్లీశ్వరి కథలోకి వెళ్లక తప్పదు. ఆ సినిమాలో వెంకటేష్ బ్యాక్ ఉద్యోగి పాత్ర పోషిస్తాడు.
బ్యాగులు రెండూ ఒకేలా:
రోజు బ్యాంక్ కు వెళ్లే సమయంలో ఇదే నల్లటి బ్యాగ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి కత్రినాకైఫ్ తో బీచ్ లో ఓ కాంబినేషన్ సన్నివేశం ఉంటుంది. అందులో ఈ నల్లటి బ్యాక్ బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడా బ్యాగ్...తాజా పోస్టర్ లో ఉన్న బ్యాగ్ సరి పోల్చితే రెండు ఒకటే కదా? అన్న సందేహం రాకమానదు. ఆ రెండు బ్యాగులు ఒకేలా ఉన్నాయి. బ్యాగ్ డిజైన్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో మల్లీశ్వరికీ -ఈ కథకు ఏదైనా సంబంధం ఉందా? అన్న సందేహాలు రాక మానవు. `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` ని `మల్లీశ్వరికీ 2.0`గా చూడొచ్చు అన్న క్వశ్చన్ రెయిజ్ అవుతుంది.
ఆదర్శ కుటుంబంపై మల్లీశ్వరి ప్రభావం
`మల్లీశ్వరి` రిలీజ్ అయి రెండు దశాబ్దాలు పూర్తయింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ జరుగుతుందంటే? ఆ సినిమా సాధించిన విజయమే. అందులో ప్రతీ పాత్ర ఎంతో గొప్పగా పండుతుంది. ఇదంతా పక్కన బెడితే? గురూజీ కథలు రకరకాల భాషల సినిమాల నుంచి ఇన్ స్పైర్ అయి రాస్తుంటారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.`మల్లీశ్వరి`కీ తానే రైటర్ కాబట్టి ఆ ప్రభావం ఆదర్శ కుటుంబం పై ఎంతో కొంత ఉన్నా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
