Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో వెంకీ, నారా రోహిత్.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?

ప్రస్తుతం ఆదర్శ కుటుంబం మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం.. ప్రస్తుతం ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   20 Jan 2026 9:23 AM IST
ఒకే ఫ్రేమ్ లో వెంకీ, నారా రోహిత్.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?
X

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం AK47 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా.. ఆ రెండు సినిమాల తర్వాత వారి కాంబోలో వస్తున్న ఫుల్ లెంగ్త్‌ మూవీ ఇదే. దీంతో ఆడియన్స్ తోపాటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ లకు పెట్టింది పేరు అయిన వెంకటేష్ ను డైలాగ్స్ మాస్టర్ త్రివిక్రమ్ తన దర్శకత్వంలో ఎలా కనిపించబోతున్నారన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే మేకర్స్ లాంచ్‌ చేసిన ఫస్ట్ లుక్‌ లో వెంకీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ కు కనెక్ట్ అయ్యే పాత్రలో సందడి చేయనున్నారని క్లారిటీ వచ్చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోపాటు క్రైమ్ టచ్ ఉన్న కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆదర్శ కుటుంబం మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం.. ప్రస్తుతం ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అంతేకాదు.. షూటింగ్‌ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. అందుకే రోజుకి ఎక్కువ సన్నివేశాలు షూట్ చేస్తూ చిత్రీకరణను ముందుకు తీసుకెళ్తున్నారు. వేసవిలో మూవీ రిలీజ్ చేయనున్నట్లు వినికిడి.

ఇదిలా ఉండగా.. సినిమాలో కీలక పాత్ర కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ను సెలెక్ట్ చేసినట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. యాంటీ కాప్‌ రోల్‌ లో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ సెట్స్‌ లో చేరి తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. నారా రోహిత్ పాత్ర కథలో ముఖ్యమైన మలుపుగా ఉండబోతుందని సమాచారం.

ముఖ్యంగా వెంకటేష్ తో కలిసి నారా రోహిత్ కనిపించే సీన్స్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో నారా రోహిత్ నటిస్తున్నారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు స్పందిస్తూ.. మూవీ కోసం త్రివిక్రమ్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉన్నట్లు ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచి స్కోప్ ఉన్న రోల్ లో ఆమె కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో జోడీ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని సమాచారం. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. కథకు తగ్గ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో పాటు మెలోడీ సాంగ్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. నిర్మాణ బాధ్యతలు ప్రముఖ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చేపట్టింది.