భయం గుప్పిట్లో బ్రతికా..
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాల్లో క్షణం సినిమా కొంతమేరకు బాగానే ఆడింది..
By: Madhu Reddy | 13 Nov 2025 1:00 PM ISTచాలామంది హీరోయిన్స్ కు మొదటి సినిమాతోనే గుర్తింపు రాదు. ఎన్ని సినిమాలు చేసినా ఊహించిన స్థాయిలో పేరు రాకుండా ఉండటం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. కేవలం వాళ్ళు చేసే ఒకే ఒక ప్రాజెక్ట్ విపరీతమైన గుర్తింపుతో పాటు విమర్శలు కూడా తీసుకొస్తుంది. 1920 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆదాశర్మ. బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
నితిన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. కానీ ఊహించిన స్థాయిలో ఆదాశర్మకు అవకాశాలు రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో పల్లవి అనే పాత్రలో కనిపించింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. హీరోయిన్ గా నటించిన ఆదాశర్మ ను కేవలం ఒక పాత్రకు మాత్రమే పరిమితం చేసేసారు.
ది కేరళ స్టోరీతో గుర్తింపు
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాల్లో క్షణం సినిమా కొంతమేరకు బాగానే ఆడింది..ఆ తర్వాత రాజశేఖర్ నటించిన కల్కి సినిమాలో కూడా కనిపించింది. ఇన్ని సినిమాలు చేసినా కూడా తనకు పేరు తీసుకొచ్చిన సినిమా ఒకటంటూ కూడా లేదు.
కొన్ని సినిమాలు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సినిమాల్లో ది కేరళ స్టోరీ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా వచ్చినంత వరకు కూడా మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆదాశర్మ ఎదురుచూసిందట. మొత్తానికి ఆ సినిమా విడుదలైన తర్వాత నా కెరియర్ మారిపోయింది అంటూ ఆదాశర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
చాలా భయపడ్డాను
ది కేరళ స్టోరీ సినిమా తర్వాత, బస్తర్ ది నక్సల్ స్టోరీ కూడా చేసింది. ఆ సినిమా కూడా ఒక సంచలనంగా మారింది అయితే ఆ సినిమా విడుదలైనప్పుడు ఆదాశర్మకు చాలా బెదిరింపులు వచ్చేయట. భయం గుప్పిట్లో బ్రతికా అని చెప్పింది. దేశంలో సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు వారంతా నన్ను రక్షించారు అంటూ చెప్పింది ఆదా.
అలానే స్క్రిప్ట్ ఎంచుకునే విధానంలో ఛాలెంజింగ్ గా ఉండాలి అంటూ మాట్లాడింది. పాత్రలో బలమైన ఎమోషన్ లేకపోతే నాకు నచ్చదు అలానే యాక్షన్ సీక్వెన్స్ ఉండేటట్లు చూసుకుంటాను. నేను చేసే పాత్రలో ఎమోషన్ టచ్ కూడా ఉండాలి. నేను చేసే సినిమాలు నా కుటుంబాన్ని కూడా కొంత కదిలించాలి. ఇలాంటివన్నీ లేకపోతే ఆ పాత్ర చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది అని ఆదాశర్మ చెప్పారు.
