హీరోల విషయంలో ఈ భామలంతా ఒకే మాట!
తమతో పాటు హీరోయిన్లను సమానంగా ట్రీట్ చేస్తారని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు `పరదా` సినిమా ఈవెంట్ లో అనుపమా పరమేశ్వరన్ కూడా అసహనాన్ని వ్యక్తం చేసింది.
By: Srikanth Kontham | 4 Sept 2025 9:00 AM ISTలేచింది నిద్ర లేచింది మహిళా లోకం ! అన్నట్లే ఉంది సన్నివేశం. హీరోలను ఉద్దేశించి కొంత మంది హీరోయిన్లు చేసిన కామెంట్లు చూస్తుంటే లేడీ హీరోయిన్లు ఎంత సీరియస్ గా ఉన్నారు? అన్నది అద్దం పడుతుంది. ఇటీవలే జ్యోతిక సౌత్ ఇండస్ట్రీ హీరోలను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సౌత్ లో సమానత్వం ఉండదని..కనీసం అదే సినిమాలో నటించిన హీరో తమ పోస్టర్ ని కూడా షేర్ చేయరని అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు ఎంతో మెరుగ్గా ఉంటా రన్నారు.
వాళ్లు తప్పు చేసినా ఒప్పే:
తమతో పాటు హీరోయిన్లను సమానంగా ట్రీట్ చేస్తారని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు `పరదా` సినిమా ఈవెంట్ లో అనుపమా పరమేశ్వరన్ కూడా అసహనాన్ని వ్యక్తం చేసింది. హీరోయిన్లకు పెద్దగా విలువ ఉండదన్నారు. ప్రత్యేకించి లేడీ ఓరియేంటెడ్ చిత్రాలను ఎవరూ పట్టించుకోరని ఆరోపించింది. కమర్శియల్ సినిమాల్లో తప్పులున్నా? పట్టించుకోరని...కానీ హీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రా ల్లో తప్పులను మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతారని ఆరోపించింది.
పట్టించుకునే నాధుడెవరు?
వీళ్లిద్దరి కంటే ముందు బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా హీరోల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. హీరోలకు ఖరీదైన కార్లు, హోటల్స్ సౌకర్యాలు కల్పిస్తారని, కానీ ఆ రేంజ్ సౌకర్యాలు హీరోయిన్లకు కల్పిం చరని..ఇండస్ట్రీలో ఇదో రకమైన వివక్ష గా పేర్కొంది. అలాగే ముంబై బ్యూటీ పూజాహెగ్డే కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేసింది. షూటింగ్ స్పాట్ కు దగ్గరకు హీరోల కార్వాన్లు ఉంటాయని, కానీ హీరోయిన్ల కార్వాన్లు మాత్రం ఎక్కడో దూరంగా పెడతారని..ఇలాంటి పనుల వల్ల తామెంత అసౌకర్యానికి గురవుతు న్నామో ఎవరూ పట్టించుకోవడం లేదంది.
వీరందర్నీ మించి కంగన:
ఇలాంటివి ఆన్ సెట్స్ లో జరుగుతుంటే? ఆఫ్ ది సెట్ లో మరో రకమైన వివక్షకు గురికావాల్సి ఉంటుం దని ఆరోపించింది. మరో ముంబై నటి మృణాల్ ఠాకూర్ కూడా గతంలో సౌకర్యాల విషయంలో అసంతృ ప్తిని వెళ్లగక్కింది. హీరోలతో సమానంగా హీరోయిన్లను ట్రీట్ చేయడం లేదని...ఏ కారణంగా ఈ వ్యత్యాస మంటూ ప్రశ్నించింది. ఇక కంగనా రనౌత్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. సందర్భం చిక్కితే చాలు స్టార్ హీరోలందరిపై ఒంటి కాలుపై లేచిపడుతుంది. దర్శక, నిర్మాతలపై అదే రేంజ్ లో ఎటాక్ చేస్తుంది.
