Begin typing your search above and press return to search.

హేళ‌న చేసిన మేక‌ర్‌కి న‌టి గ‌ట్టి కౌంట‌ర్‌!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎలా ఎప్పుడు మారుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అలాగే ఎవ‌రిలో ఎలాంటి టాలెంట్ దాగివుంద‌న్న‌ది కూడా ఊహించ‌డం క‌ష్టం.

By:  Ravindar Gorantla   |   21 Feb 2026 8:00 PM IST
హేళ‌న చేసిన మేక‌ర్‌కి న‌టి గ‌ట్టి కౌంట‌ర్‌!
X

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎలా ఎప్పుడు మారుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అలాగే ఎవ‌రిలో ఎలాంటి టాలెంట్ దాగివుంద‌న్న‌ది కూడా ఊహించ‌డం క‌ష్టం. అందుకే ఇక్క‌డ ఎవ‌రినీ అండ‌రెస్ట్‌మేట్ చేయొద్దంటారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జ‌రిగే ఏకైక రంగం ఇది. ఈ రోజు డైరెక్ట‌ర్లే రేపు ఆర్టిస్ట్‌లు కావ‌చ్చు.. నేటి ఆర్టిస్ట్‌లే రేపు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్లూ కావ‌చ్చు. ఇలా అద్భుతాలు జ‌రిగే ఈ రంగంలో అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు కూడా జ‌రుగుతుంటాయి. అలా అవ‌మానించిన వారు ఎదుటివారి టాలెంట్‌ని, స‌క్సెస్‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోయి త‌ప్పుచేశామ‌ని బాధ‌ప‌డిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు.

ఇటీవ‌లే అలాంటి సంఘ‌ట‌నే ఓ న‌టికి ఎదురైంది. త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో హీరోయిన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన న‌టి త‌న‌దైన న‌ట‌న‌తో అందిరి దృష్టిని ఆక‌ర్షించి ప్ర‌ముఖుల చేతే శ‌భాష్ అనిపించుకుంది. తెలుగు సినిమాలో విల‌న్ పాత్ర‌కు స‌పోర్ట‌ర్‌గా న‌టించి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ త‌రువాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది.

అయితే న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆ క్రేజీ లేడీకి డైరెక్ష‌న్ చేయాలనే కోరిక పుట్టింది. అనుకున్న వెంట‌నే క‌థ‌ని రాయ‌డం మొద‌లు పెట్టింది. ఫైన‌ల్‌గా ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేసింది. భారీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ నిర్మిస్తున్న ఓ ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీకి త‌న స్టోరీ వినిపించింది. త‌ను చెప్పిన స్టోరీ వారికి న‌చ్చింది. అయితే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌ని అడిగితే తానే అని చెప్ప‌డంతో స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ హౌస్ అధినేత షాక్ అయి న‌వ్వాడ‌ట‌. నువ్వు డైరెక్ట‌ర్ ఏంటీ? అన్నాడ‌ట‌.

అంతే కాకుండా తరువాత చూద్దామ‌ని లైట్ తీసుకోవ‌డంతో హ‌ర్ట్ అయిన న‌టి తానే స్వ‌యంగా నిర్మాణంలోకి దిగి డైరెక్ట‌ర్‌గా, యాక్ట‌ర్‌గా సినిమాని పూర్తి చేయ‌డం మొద‌లు ప‌ట్టింది. ఫైన‌ల్‌గా సినిమా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా టైటిల్‌ని విడుద‌ల చేసిన స‌ద‌రు న‌టి తాజాగా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి షాక్ ఇచ్చింది. ఓ కొత్త పాయింట్‌తో చిన్న పాప మిస్సింగ్ కేసు నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని రూపొందించింది. కీల‌క పాత్ర‌ల కోసం ప్ర‌ముఖుల‌ని తీసుకుంది.

ట్రైలర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం, డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ మూవీనే మంచి క‌న్విక్ష‌న్‌తో పూర్తి చేయ‌డంతో ట్రైల‌ర్ చూసిన వాళ్లంత త‌ను త‌న వ‌ర్క్‌తో త‌న‌ని నువ్వు డైరెక్ట‌రా? అని అవ‌హేళ‌న చేసిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింద‌ని, ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా త‌న స‌త్తా ఏంటో చూపించింద‌ని కామెంట్‌లు చేస్తున్నారు. మిస్సింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స్టోరీతో రూపొందిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.