Begin typing your search above and press return to search.

అర‌డ‌జ‌ను సీక్వెల్స్‌లో జాతీయ ఉత్త‌మ న‌టి

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా అర‌డ‌జ‌ను సీక్వెల్స్ లో న‌టిస్తోంది జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు. ట‌బుకు మొద‌టిసారి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును అందించిన చాందిని బార్ సీక్వెల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   1 Oct 2025 6:00 AM IST
అర‌డ‌జ‌ను సీక్వెల్స్‌లో జాతీయ ఉత్త‌మ న‌టి
X

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా అర‌డ‌జ‌ను సీక్వెల్స్ లో న‌టిస్తోంది జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు. ట‌బుకు మొద‌టిసారి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును అందించిన చాందిని బార్ సీక్వెల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వేశ్య పాత్ర‌లో ట‌బు న‌టన‌కు విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కురిసాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం డీసెంట్ విజ‌యం సాధించింది చాందినీ బార్ నిర్మాత సందీప్ సింగ్ టబు ప్రధాన పాత్రలో సీక్వెల్ ను ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ 2025లో ప్రారంభమవుతుంది.

ట‌బు చిలిపి అమ్మాయిగా చెల‌రేగి న‌టించిన `క్రూ` చిత్రాన్ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. 2025లో విడుద‌లైన‌ క్రూ చిత్రం విజయం తర్వాత నిర్మాతలు ఇప్పుడు సీక్వెల్ పై సీరియ‌స్ గా ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ మరోసారి కలిసి కనిపిస్తారని చెబుతున్నారు.

అజ‌య్ దేవ‌గ‌న్- ర‌కుల్- ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన దేదే ప్యార్ దే ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దే దే ప్యార్ దే 2 చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి టబు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉన్న ఈ సినిమాని నవంబర్ 14న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దేవ‌గ‌న్ న‌టించిన `బోలా` ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా, ఇందులో టబు పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం `భోలా 2` ను నిర్మించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. టబు కూడా ప్రధాన పాత్రలో న‌టిస్తుంద‌ని తెలిసింది.

మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ దృశ్యంలో మూడో భాగాన్ని అజ‌య్ దేవ‌గ‌న్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దృశ్యం మొదటి, రెండవ భాగాలలో అజయ్ దేవగన్ - టబు న‌ట‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. వీలైనంత త్వరగా మూడవ భాగాన్ని రూపొందించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆయుష్మాన్ ఖురానా- ట‌బు- రాధిక ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `అంధాధున్` బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు మేక‌ర్స్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. రెండవ భాగం కోసం స్క్రిప్ట్ పై మేకర్స్ పని ప్రారంభించారు. ఇందులో కూడా టబు స‌హా ఇత‌రులు తిరిగి త‌మ పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు.

మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలోను ట‌బు కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఒకేసారి ఆరు క్రేజీ సీక్వెల్స్ లో న‌టిస్తూ ట‌బు త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉందిప్పుడు.