Begin typing your search above and press return to search.

బీచ్ లో అందాలతో ఆకట్టుకుంటున్న సన్నీలియోన్!

సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   2 Nov 2025 9:01 AM IST
బీచ్ లో అందాలతో ఆకట్టుకుంటున్న సన్నీలియోన్!
X

సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పండుగలకు సంబంధించి అయినా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అయినా.. అది శుభవార్త అయినా అశుభవార్త అయినా.. ఏదైనా సరే ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ అభిమానులకు చేరువ అవుతున్నారు సెలబ్రిటీలు. ఇకపోతే సినిమా షూటింగ్లలో నిత్యం బిజీగా ఉంటూ అలసిపోయిన ఎంతోమంది కాస్త సమయం దొరికితే చాలు అభిమానులను ఆకట్టుకోవడానికి తాము కాస్త రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.





ఈ క్రమంలోనే తాజాగా ఒక బ్యూటీ వెకేషన్ లో భాగంగా.. బీచ్ లో సందడి చేసింది. అక్కడ తన గ్లామర్ తో అభిమానులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఎవరో కాదు సన్నీలియోన్.. తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సన్నీలియోన్ ఈ ఫోటోలలో మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే బీచ్ లో చిల్ అవుతూ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది సన్నీలియోన్.





సన్నీ లియోన్ విషయానికి వస్తే.. ఒకప్పుడు అలాంటి ప్రపంచంలో బ్రతికిన ఈమె దాని నుంచి బయటపడి జిస్మ్ 2 అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత జాక్ పాట్, షూట్ అవుట్ ఎట్ వాడాలా, రాగిణి ఎంఎంఎస్ 2 అనే హిందీ చిత్రాలలో నటించిన ఈమె.. 2014లో వడకూర అనే తమిళ చిత్రంలో కూడా నటించింది. తర్వాత అదే ఏడాది తెలుగులో కరెంటు తీగ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు 2015లో డీకే అనే కన్నడ చిత్రంలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలతో పాటు మరాఠీ, బెంగాలీ వంటి చిత్రాలలో కూడా నటించింది. మలయాళం చిత్రంలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో పి ఎస్ వి గరుడవేగ, జిన్నా, మందిర వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. సన్నీలియోన్ చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఏఐ ఆధారిత చిత్రం కౌర్ వర్సెస్ కోర్ చిత్రంతోపాటు తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ త్రిముఖ , హలో కౌన్ , 120 బహదూర్, ది తాజ్ స్టోరీ వంటి ఇతర ప్రాజెక్టులలో నటించింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

ఇకపోతే ఒకవైపు లీడ్ రోల్ పోషిస్తూనే మరొకవైపు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అలాగే స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.