Begin typing your search above and press return to search.

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

నందమూరి బాలకృష్ణతో కలిసి ‘సమరసింహారెడ్డి’లో నటించిన అనుభవాలను నటి సంఘవి పంచుకున్నారు. బాలయ్యకు కోపం ఎక్కువని విని తొలుత భయపడ్డానని, షూటింగ్ సమయంలో ఆయనే తన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడేవారని తెలిపారు. బాలకృష్ణ చాలా స్వీట్ పర్సన్ అని, స్నేహపూర్వకంగా ఉంటారని ప్రశంసించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 Nov 2026 7:15 AM IST
బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి
X

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆయనతో కలిసి పనిచేయాలంటే.. ఆయన గురించి తెలియని వాళ్ళు కొంతమంది భయపడతారని కూడా తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం.. ఆయన మంచితనం గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

ఈ క్రమంలో.. బాలకృష్ణ షూటింగ్ సమయంలో.. ఎలా ప్రవర్తిస్తారు అనే విషయంపై తాజాగా సీనియర్ హీరోయిన్ సంఘవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణతో సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన సంఘవి.. బాలకృష్ణతో కలిసి పనిచేసినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

అసలు విషయానికి వస్తే..సీనియర్ హీరోయిన్ మహేశ్వరి ప్రస్తుతం సెలబ్రిటీలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఆమె తాజాగా సంఘవి, మీనాతో కూడా ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో.. మహేశ్వరి సంఘవిని ప్రశ్న అడుగుతూ.. “ఎవరన్నా ఒక హీరోతో అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఆ హీరోనా అని చాలా భయపడి.. కానీ సినిమా మొదలైన తర్వాత.. ఈ హీరో ఇంత మంచోడా అనుకున్న సందర్భలు ఉన్నాయా,” అని అడిగింది.

దీనికి వెంటనే సంఘవి నందమూరి బాలకృష్ణ పేరును తెలిపింది. తెలుగులో బాలకృష్ణకు చాలా కోపం ఉంటుందని తనకు చాలామంది చెప్పారని.. ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు తాను కూడా కొంత భయపడ్డానని తెలిపారు.

అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణను చూసి తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని సంఘవి చెప్పారు. తాను షూటింగ్ సమయంలో చాలా సైలెంట్ గా కూర్చుని ఉండటాన్ని.. గమనించిన బాలకృష్ణ స్వయంగా తన దగ్గరకు వచ్చి ఎందుకమ్మా.. ఎందుకు అంత సైలెంట్‌గా ఉంటున్నావని, ఏమీ మాట్లాడటం లేదని ఆప్యాయంగా అడిగేవారని తెలిపింది.

ఆ సమయంలో బాలకృష్ణతో తనకున్న భయాన్ని కూడా సంఘవి బయటపెట్టారంట. మీకు కోపం ఎక్కువని విన్నాను కాబట్టి కొంచెం భయంగా ఉందని చెప్పినట్లు వెల్లడించారు. దానికి బాలకృష్ణ జవాబు ఇస్తూ.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా ఉన్న.. ఆ తర్వాత బయట చాలా జాలీగా ఉంటానని తెలిపాడని చెప్పుకొచ్చింది. పని విషయంలో తనదైన శైలిలో ఉందే బాలకృష్ణ, షూటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ అందరితో సరదాగా మాట్లాడుతారని..బాలకృష్ణ చాలా స్వీట్ పర్సన్ అని, ఎంతో నిరాడంబరంగా ఉంటారని ఆమె ప్రశంసించారు.

సాధారణంగా బాలకృష్ణ కోపం, ఆయన యాటిట్యూడ్ గురించి సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు.. ఆయన తోటి నటి నటులు చాలామంది ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మనస్తత్వాన్ని ఇలా చెబుతూ.. బాలయ్య మనసు వెన్న అని ప్రూవ్ చేస్తూ ఉంటారు.