తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!
ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుండగా..ఒక సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 4 Nov 2026 11:33 PM ISTప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుండగా..ఒక సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకు ఎంతో ఇష్టమని చెప్పిన హీరోయిన్ సంగీత మాటలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ సంగీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లాం ఊరెళితే, ఖడ్గం వంటి సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో మంచి అవకాశాలు అందుకున్న సంగీత, ఆ తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించారు.
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సంగీతను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఈ నాలుగు సౌత్ ఇండస్ట్రీలలో మీకు ఏ ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్నించారు.
దీనికి యాంకర్ వెంటనే తమిళ ఇండస్ట్రీ అని సమాధానం వస్తుందని భావించారు. కానీ సంగీత మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. దాంతో యాంకర్ ఆశ్చర్యపోయి ఎందుకు తమిళ ఇండస్ట్రీ కాదు అని అడిగింది. అందుకు సంగీత తెలుగు ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పింది. తాను తమిళ సినిమాలు చేసినప్పటికీ, తెలుగులోనే ఎక్కువ గౌరవం, అవకాశాలు, విలువ లభించాయని తెలిపారు. అంతేకాదు తను చెప్పే మాటలు చాలామందికి కోపం తెప్పియవచ్చు అని.. కానీ తనకు మాత్రం తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో నటీనటులకు ఇచ్చే గౌరవం తనకు ఎంతో నచ్చుతుందని సంగీత చెప్పారు. తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం సంగీత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నా.
మాటలు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను సంతోషపెడుతున్నాయి. ఇతర భాషల్లో సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీ తనకు ఎంతో ప్రత్యేకమని సంగీత చెప్పడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
