గ్లామర్ తో కట్టిపడేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్!
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈమె దేదే ప్యార్ దే సీక్వెల్ దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 13 Nov 2025 9:44 AM ISTఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ ను వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా.. మరొకవైపు సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్లామర్ ఉట్టిపడేలా తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈమె దేదే ప్యార్ దే సీక్వెల్ దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా అభిమానులను ఆకట్టుకోవడానికి అలాగే తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. తాజాగా బీచ్ ఒడ్డున గ్లామర్ తో కట్టిపడేస్తూ అందమైన బ్లాక్ డ్రెస్ ధరించి ఫోటోలను షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. పైగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "ఆయేషాను మీట్ అవడానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నేను కూడా నవంబర్ 14 కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను.. టికెట్స్ బుక్ చేసుకోండి " అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఈమె అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా సినిమాపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారు. మరి రేపు విడుదల కాబోయే ఈ సినిమా రకుల్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
దేదే ప్యార్ దే 2 సినిమా విషయానికి వస్తే..అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. అన్షుల్ శర్మ దర్శకత్వంలో టి సిరీస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి "విరహగీతం ఆఖరి సలాం" అంటూ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సాగర్ భాటిగా రాసి స్వరపరిచిన ఈ పాటను.. అర్మాన్ మాలిక్ తన గొంతుతో ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.." ప్రార్ధన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ" అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులోకి తొలిసారి కెరటం అనే సినిమాతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగు చలనచిత్ర నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.
చివరిగా అయలాన్ 2, భారతీయుడు 2, మేరే హస్బెండ్ కీ బీవీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ప్రస్తుతం భారతీయుడు 3, దేదే ప్యార్ దే 2 వంటి చిత్రాలలో నటిస్తోంది.
