పెళ్లే నా పాలిట శాపం..
సినిమాలలో చూపించినట్టు కొంతమంది వైవాహిక బంధం స్వర్గంలా అనిపిస్తే.. మరి కొంతమంది వైవాహిక బంధం నరకప్రాయంగా అనిపిస్తుంది.
By: Madhu Reddy | 21 Dec 2025 2:00 AM ISTసినిమాలలో చూపించినట్టు కొంతమంది వైవాహిక బంధం స్వర్గంలా అనిపిస్తే.. మరి కొంతమంది వైవాహిక బంధం నరకప్రాయంగా అనిపిస్తుంది.అయితే కొంతమంది ఆ నరకాన్ని అలాగే భరిస్తే.. మరికొంతమంది విడాకుల పేరిట వేరుపడుతున్నారు. ఇంకొంతమంది వైవాహిక జీవితం వల్లే తమ జీవితం నాశనమైందని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే తన నటనతోనే కాదు పవర్ లిఫ్టింగ్ తో కూడా యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న ప్రముఖ సెలబ్రిటీ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు సినిమాలలో అత్తగా, అక్కగా, చెల్లిగా, వదినగా ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి, ప్రేక్షకులను మెప్పించిన ప్రగతి.. ఈమధ్య పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో పాల్గొని ఏకంగా ఇండియాకి నాలుగు మెడల్స్ ను అందించింది.
అలాంటి ఈమె మెడల్స్ సాధించిన తర్వాత పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాను అనుభవించిన మంచి రోజులను కూడా ఆమె చెప్పుకొచ్చింది. పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మీ ఆలోచన ఎలా మారింది అని ప్రశ్నించగా.. ఎవరైతే నన్ను ఈ వయసులో పవర్ లిఫ్టింగ్ కి వెళ్తున్నానని చెప్పినప్పుడు విమర్శించారో నా మెడల్సే వారికి సమాధానం చెప్పాను అంటూ తెలిపింది.
జీవితంలో మీరు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏమిటి అని ప్రశ్నించగా.. నేను పెళ్లి చేసుకోవడమే.. నేను చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఓపెన్ గానే చెప్పేసింది ప్రగతి. భాగ్యరాజా సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది. కానీ భర్త కండిషన్స్ పెట్టడం వల్లే విడిపోయిన ఈమె మళ్లీ రెండో పెళ్లి అనే ఆలోచన చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తే.. నా వయసుకు తగ్గట్టు ఉండే వ్యక్తితో పాటు నా ఆలోచనలను కూడా పాటించే వ్యక్తి రావాలి. అయితే ఇప్పట్లోనే కాదు ఎప్పుడూ కూడా అలా ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రగతి ఆడియన్స్ తో పంచుకోవడం విశేషం.
