Begin typing your search above and press return to search.

పిల్లల జీవిత నిర్ణయాలు వారివే.. పెళ్లి బాధ్యతపై ప్రగతి ఓపెన్ కామెంట్స్!

తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పిల్లల పెళ్లిళ్లు, వారి భవిష్యత్తు నిర్ణయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Madhu Reddy   |   17 Aug 2026 11:00 PM IST
పిల్లల జీవిత నిర్ణయాలు వారివే.. పెళ్లి బాధ్యతపై ప్రగతి ఓపెన్ కామెంట్స్!
X

తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పిల్లల పెళ్లిళ్లు, వారి భవిష్యత్తు నిర్ణయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తన పిల్లల బాధ్యత ఎంతవరకు ఉందో స్పష్టం చేస్తూ, వారు సెటిల్ అయ్యాక పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులపై లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఆలోచనా విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతో ఆలోచింపజేస్తోంది.

పిల్లల పెళ్లి వారి ఇష్టం.. నా బాధ్యత కాదు:

పిల్లల పెంపకం, వారి పెళ్లిపై ప్రగతి మాట్లాడుతూ.. "కెరీర్ పరంగా వారికి కాళ్లు వచ్చి సెటిల్ అయ్యేంత వరకే పిల్లలు నా బాధ్యత. అంతే తప్ప వాళ్లకు పెళ్లి చేయడం నా బాధ్యత ఎంతమాత్రం కాదు. మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండి, తమ జీవితంలోకి ఇంకొకరిని భాగస్వామిగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం పూర్తిగా వారి ఇష్టం. తమ పెళ్లి తమకే చేసుకోవడం రానప్పుడు ఇక వారెందుకు పెళ్లి చేసుకోవాలి?" అని ప్రగతి ఓపెన్‌గా స్పష్టం చేశారు.

పిల్లలను చూసి గర్వపడుతున్నా:

తన పిల్లలే తన ప్రపంచమని ప్రగతి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు చదువు పూర్తి చేసుకుని బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని, కూతురు ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నత చదువులు చదువుకుంటోందని తెలిపారు. ఇక సమాజానికి సరైన పద్ధతిలో పెంచిన మంచి పిల్లలను అందించాననే సంతృప్తి తనకు ఉందంటూ ఓ తల్లిగా గర్వంగా చెప్పుకొచ్చారు.

ఫిట్‌నెస్ పై తగ్గని ఇష్టం సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్‌పై తనకున్న ఆసక్తిని ప్రగతి పంచుకున్నారు. ఇటీవల అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు రజత పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె, తన ఫిట్‌నెస్ ప్రేమాన్ని చాటుకున్నారు. "నేను జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా హ్యాపీగా బతకగలను కానీ, వర్కౌట్స్ చేయకుండా మాత్రం ఒక్క రోజు కూడా ఉండలేను" అని నవ్వుతూ చెప్పారు.

చిన్న, పెద్ద సినిమాలపై ప్రగతి అభిప్రాయం:

నటన అనేది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకేలా ఉంటుందని ప్రగతి అభిప్రాయపడ్డారు. కేవలం బడ్జెట్‌ను బట్టే చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా ఉంటుందని, అంతేతప్ప నటీనటులు లేదా దర్శకుల స్థాయిని బట్టి కాదని స్పష్టం చేశారు. ఇక తన కెరీర్‌లో 99 శాతం సినిమాలు విడుదలయ్యాయని, పెద్ద బ్యానర్లలోనే కాక చిన్న సినిమాల్లోనూ నటించానని తెలిపారు.

పిల్లల పెళ్లిళ్ల విషయంలో సమాజం విధించే పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి ప్రగతి చెప్పిన మాటలు ఆధునిక తల్లిదండ్రులకు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఇక పిల్లలకు స్వేచ్ఛనిస్తూనే, వారిని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దిన ప్రగతి ఆలోచనా విధానాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.