Begin typing your search above and press return to search.

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

‘గుంటూరు కారం’, ‘జైలర్ 2’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న పూర్ణకు ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ కొత్తగా వచ్చినట్లు కనిపించడం లేదు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పిశాచి 2’ వంటి పెండింగ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. వివాహం, కుటుంబ బాధ్యతలతో పాటు బలమైన పాత్రల కోసం ఆమె ఎదురుచూస్తుండటం కూడా ఇందుకు కారణమనే చర్చ సాగుతోంది.

By:  Srikanth Kontham   |   24 Nov 2026 5:58 AM IST
ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?
X

హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్ ఇటీవలి కాలంలో స్పెషల్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒకప్పుడు సంప్రదాయబద్ధమైన పాత్రలకే పరిమితమైన అమ్మ‌డు ఇప్పుడు మాస్ బీట్స్‌కు స్టెప్పులేస్తూ ఐటమ్ భామగా సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆసక్తికరంగా మలుచుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపిస్తూ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయిస్తున్నారు.

పూర్ణ కెరీర్‌లో స్పెషల్ సాంగ్స్‌కు అసలైన ఊపునిచ్చింది సూపర్ స్టార్ మహేశ్ గుంటూరు కారం సినిమా అనే చెప్పాలి. రెండేళ్ల క్రితం విడుదలైన చిత్రంలోని కుర్చీ మడతపెట్టి పాటలో అమ్మ‌డు వేసిన మాస్ స్టెప్పులు ఎంత ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఆ ఒక్క పాటతో పూర్ణ‌ డాన్స్ ప్రతిభ మరోసారి గుర్తొచ్చింది. అంతకుముందు శ్రీమంతుడు, రాజాధిరాజా లాంటి చిత్రాల్లో చిన్నపాటి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినా? గుంటూరు కారం సొగ‌స‌రికి మాస్ ఆడియన్స్‌లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఆ జోరును కొనసాగిస్తూ రజనీకాంత్ నటించిన జైలర్ 2`లోనూ పూర్ణ మరోసారి మెరిశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన `అలా బొలెలో అనే ప్రత్యేక గీతంలో తలైవాతో కలిసి చిందేశారు. కేరళ సంప్రదాయ కసవు చీరలో కనిపిస్తూనే గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో ఆకట్టుకుని మరో చార్ట్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఇలాంటి భారీ హిట్ సాంగ్స్ పడిన తర్వాత పూర్ణ లైనప్ ఎలా ఉందనే ప్రశ్న ప‌రిశ్ర‌మ‌లో ఆసక్తికరంగా మారింది. అఖండ 2, జైలర్ 2 లాంటి పెద్ద చిత్రాల్లో క‌నిపించినా? ప్రస్తుతం ఆమె చేతిలో కొత్తగా కమిట్ అయిన భారీ ప్రాజెక్టులేవీ ఉన్నట్లు కనిపించలేదు. మిస్కిన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న పిశాచి 2 లాంటి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు మినహా కొత్త సినిమాలేవి ఇటీవల రాలేదు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ హిట్ అయితే వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. కానీ పూర్ణ విషయంలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. వివాహం.. కుటుంబ బాధ్యతల తర్వాత అమ్మ‌డు చాలా సెలెక్టివ్‌గా వ్య‌వ‌రించ‌డం ఓ కారణమైతే.. స్పెషల్ సాంగ్స్‌కే పరిమితం కాకుండా బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తుండటం మరో కారణంగా తెలుస్తోంది.

ఒకవైపు నటిగా.. మరోవైపు స్పెషల్ సాంగ్ స్పెషలిస్ట్‌గా ప్రతిభను నిరూపిం చుకున్న పూర్ణ ఇలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మళ్లీ ఏదైనా భారీ మాస్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ ఇస్తుందా? అచ్చొచ్చిన క్యారెక్టర్ రోల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వ‌స్తుందా? అనేది తేలాల్సి ఉంది.