Begin typing your search above and press return to search.

అమ్మ చీరతో... హీరోయిన్‌పై ప్రశంసలు

ఈ మద్య కాలంలో చాలా మంది హీరోయిన్స్‌ తమ వివాహం సందర్భంగా ధరించే డ్రెస్‌లు, చీరలు చర్చనీయాంశం అవుతున్నాయి. లక్షలు ఖర్చు చేశారు, ఇంత ప్రాధాన్యత ఈ చీరకు ఉంది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.

By:  Ramesh Palla   |   29 April 2026 11:00 PM IST
అమ్మ చీరతో... హీరోయిన్‌పై ప్రశంసలు
X

సోషల్‌ మీడియాలో పాపులర్ అయ్యి, సెలబ్రిటీ హోదా దక్కిన వారు కూడా తమ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వారు షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలు మామూలు హంగామా కాదు. సంపాదనతో సంబంధం లేకుండా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం, ఫంక్షన్ లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు మాత్రం చాలా సింపుల్‌ వెడ్డింగ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు రిచ్‌ వెడ్డింగ్‌ చేసుకుంటూనే సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్దలకు గౌరవం ఇచ్చే విధంగా తమ వివాహం ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మద్య కాలంలో చాలా మంది హీరోయిన్స్‌ తమ వివాహం సందర్భంగా ధరించే డ్రెస్‌లు, చీరలు చర్చనీయాంశం అవుతున్నాయి. లక్షలు ఖర్చు చేశారు, ఇంత ప్రాధాన్యత ఈ చీరకు ఉంది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.




మెహ్రీన్‌ పెళ్లి చీర...

ఇక కొందరు హీరోయిన్స్‌ తమ తల్లికి చెందిన పెళ్లి చీర లేదా ప్రత్యేకమైన చీరను రీ డిజైన్‌ చేసి కట్టుకోవడం మనం చూస్తున్నాం. ఆ మధ్య నిహారిక కొణిదెల పెళ్లికి తన తల్లి చీర కట్టుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత చాలా మంది సైతం తమ తల్లికి గౌరవం ఇస్తూ, సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వచ్చారు. తల్లి పెళ్లి చీర కట్టుకుని పెళ్లి కూతురు కావడం అనేది ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. తాజాగా హీరోయిన్‌ మెహ్రీన్‌ తన తల్లి పెళ్లి చీరను కట్టుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లి యొక్క పెళ్లినాటి చీరను ఈతరంకు తగ్గట్లుగా డిజైన్‌ చేయించుకుని మెహందీ వేడుకలో ధరించింది. లెహంగా గాగ్రా ను మెహ్రీన్‌ ధరించి మెహందీ లో కనిపించింది. విభిన్నంగా ఉన్న ఆ లెహంగా గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూ ఉండగా తన తల్లి పెళ్లి చీరతో దాన్ని డిజైన్‌ చేసినట్లుగా మెహ్రీన్‌ చెప్పింది.




అర్ష్‌ ఔలఖ్‌ ను వివాహం చేసుకున్న మెహ్రీన్‌...

ఈనెల 26న అర్ష్‌ ఔలఖ్‌ ను వివాహం చేసుకున్న మెహ్రీన్‌ మెల్ల మెల్లగా తన వివాహ ఫోటోలను రివీల్‌ చేస్తూ వచ్చింది. పెళ్లికి ముందు వరకు మెహ్రీన్‌ సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చింది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత రివీల్‌ చేసింది. పెళ్లిని సీక్రెట్‌గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మెహ్రీన్‌ ఈ మద్య కాలంలో సినిమాలకు దాదాపుగా దూరం అయ్యింది. చాలా కాలంగా ఈమెకు ఆఫర్లు రావడం లేదు. మధ్యలో ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకే మెహ్రీన్‌ వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. పెళ్లి చేసుకున్నప్పటికీ నటించేందుకు ఆమె రెడీగానే ఉందని తెలుస్తోంది. అయితే ఇంతకు ముందే రాని ఆఫర్లు పెళ్లి తర్వాత వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.




తల్లి చీరతో పెళ్లికి రెడీ...

మొత్తానికి మెహ్రీన్‌ పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ పెళ్లి మెహందీ వేడుకలో తల్లి పెళ్లి చీరను రీ డిజైన్ చేయించి లెహంగా గా మార్చడం ద్వారా మరింత వార్తల్లో నిలిచింది. కొంత మంది హీరోయిన్స్‌, సోషల్‌ మీడియా సెలబ్రిటీల మాదిరిగా కాకుండా తల్లి సెంటిమెంట్‌కు గౌరవం ఇస్తూ తల్లి పెళ్లి చీరను తన పెళ్లికి కట్టుకోవడం ద్వారా మెహ్రీన్‌ పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది తల్లికి ఆమె ఇచ్చే మంచి బహుమానంగా కూడా చాలా మంది అభివర్ణిస్తున్నారు. మెహ్రీన్‌ వివాహంకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అర్ష్‌ ఔలఖ్‌ తో మెహ్రీన్‌ ప్రేమ వ్యవహారం, పెళ్లి వరకు జర్నీ ఎలా సాగింది అనే విషయాలను ఆమె మీడియా ముందుకు వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి సినిమాలు ఏమీ చేయడం లేదు కనుక ఇప్పట్లో ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.