ఆ నటుడి హోటల్ లో రూమ్ వద్దనేసిన నటి!
సీనియర్ నటి మీనా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసారు.
By: Srikanth Kontham | 11 Nov 2025 3:00 PM ISTసీనియర్ నటి మీనా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా ఏ భాషను మీనా మిస్ అవ్వలేదు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసారు. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేయలేకపోయారు. 1992 లో `పర్దా హై పర్దా` లో నటించిన హిందీ సినిమా మనహా మరో చిత్రం చేయలేదు. అయితే అవకాశాలు వచ్చినా చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉండేవారు అప్పట్లో. సౌత్ సినిమాలతో ఊపిరి ఆడకుండా పని చేసేవారు. ఒకేసారి ఒకే రోజులో నాలుగైదు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం..అదే సమయంలో హిందీ అవకాశాలు వచ్చినా పని చేయలేకపోయేవారు.
ఆయన హోటల్ లోనే బస:
అలా హిందీ పరిశ్రమకు మీనా కెరీర్ ఆరంభం నుంచి దూరంగానే ఉన్నారు. కానీ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మాత్రం మీనాను ఎలాగైనా బాలీవుడ్ లో ఫేమస్ చేయాలనే ప్రయత్నాలు చేసినట్లు మీనా మాటల్లో స్పష్టమైంది. బాలీవుడ్ లో తనకు వచ్చిన అవకాశాల్ని ఎలా వదులుకుందన్నది తాజాగా రివీల్ చేసారు. అప్పటి రోజుల్లో షూటింగ్ కోసం మీనా తరుచూ ఊటీ వెళ్లేవాళ్లమని.. ఆసమయంలో మిథున్ చక్రవర్తి హోటల్ లోనే బస ఏర్పాటు ఉండేదన్నారు. మీనా హోటల్ కు వచ్చిన సమయంలో మిథున్ చక్రవర్తి దగ్గరకొచ్చి తనతో సినిమా ఎప్పుడు చేస్తావ్ అని అడిగేవారన్నారు.
ఛాన్స్ వచ్చినా తక్కువ సినిమాలే:
అలా చాలా సార్లు అడిగినా మీనా పని చేయలేకపోయానన్నారు. అయితే అలా పదే పదే అడిగే సరికి కొన్నాళ్లకు ఆ హాటల్ కి కూడా వెళ్లడం మానేసినట్లు తెలిపారు. తన స్టాప్ తో ఆ హోటల్ లో రూమ్ కూడా బుక్ చేయోద్దని ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అంత పెద్ద స్టార్ సినిమా అవకాశం ఇచ్చినా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు తెలిపారు. మిథున్ చక్రవర్తి ఇచ్చిన అవకాశాలు వినియోగించుకుంటే అక్కడా తన మార్క్ వేసేదాన్ని అని అభిప్రాయపడ్డారు. అయితే ఒకవేళ బాలీవుడ్ లో పని చేసినా ఎక్కువ సినిమాలైతే చేసేదాన్ని కాదనే సందేహాన్ని వ్యక్తం చేసారు.
సెకెండ్ ఇన్నింగ్స్ లో అక్కడే బిజీ:
బాలీవుడ్ అంటే సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని, రకరకాల కారణాలతో రిలీజ్ లు వాయిదా పడతాయి? అన్న చర్చ అప్పట్లో తమ జనరేషన్ నటీమణులు మధ్య తరుచూ చర్చ జరిగేదన్నారు. ఆ కారణంగా కూడా తాను వెనకడుగు వేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మీనా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనాకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటిస్తున్నారు. `దృశ్యం 2` తర్వాత మీనా మరో తెలుగు సినిమాలో కనిపించని సంగతి తెలిసిందే.
