10కోట్లకు కొని 100కోట్లకు అమ్మిన చిరంజీవి హీరోయిన్!
సీనియర్ నటి మీనా రియల్ ఎస్టేట్ రంగంలో కళ్లు చెదిరే లాభాన్ని ఆర్జించి వార్తల్లో నిలిచారు.
By: Srikanth Kontham | 13 April 2026 9:00 AM ISTసీనియర్ నటి మీనా రియల్ ఎస్టేట్ రంగంలో కళ్లు చెదిరే లాభాన్ని ఆర్జించి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం. సుమారు రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఆస్తి ఇప్పుడు అక్షరాలా 100 కోట్లకు అమ్ముడైందని వినిపిస్తోంది. ఒక సినీ నటి ఇల్లు ఇంతటి భారీ ధరకు అమ్ముడవ్వడం కోలీవుడ్ సహా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆస్తి వెనుక ఉన్న లాభాల లెక్కలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మీనా ఈ ఇంటిని స్థలాన్ని సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించుకున్నారట.
అంటే ఇప్పుడు ఆమెకు వచ్చిన విక్రయ ధరతో పోలిస్తే ఇది పది రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు సరైన ప్రాంతంలో పెడితే కాలక్రమేణా అవి ఎంతటి సంపదను సృష్టిస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చెన్నైలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇల్లు మీనాకు ఎంతో ఇష్టమైంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న ప్పుడు ఎంతో ఇష్టపడి నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కుమార్తె నైనిక చదువు , ఇతర వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఇంటిని విక్రయించి మరో ప్రాంతానికి మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దీనిలో భాగంగానే ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కు ఈ ప్రాపర్టీని అమ్మినట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా మీనా ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు. `దృశ్యం` సిరీస్‌తో ఆమె దక్షిణాది అంతటా మళ్ళీ క్రేజ్ సంపాదిం చుకున్నారు. ప్రస్తుతం `దృశ్యం 3` లో నటిస్తున్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్ షూటింగ్ కూడా పూర్తయింది. తెలుగులోనూ దృశ్యం ప్రాంచైజీ సక్సెస్ అయిన నేపథ్యంలో పార్ట్ 3 ఇక్కడా తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఒకవేళ మొదలైతే? అందులోనూ మీనా నటించనున్నారు.
భర్త విద్యాసాగర్ మరణం తర్వాత ఆమె ఎంతో ధైర్యంగా జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటారనే వార్తలొచ్చినప్పటికీ వాటిని ఆమె ఖండించింది. మీనా ఇంటి విక్రయం ద్వారా వచ్చిన 100 కోట్ల డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భారీ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం , ఇతర పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ముంబై లేదా హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో కొత్త పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ సంపాదనను కేవలం లగ్జరీ వస్తువులపై కాకుండా ఇలాంటి దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ ఆస్తులపై వెచ్చించడం వల్ల వారి ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. గతంలో పలువురు అగ్ర తారలు తమ పాత నివాసాలను విక్రయించి లాభాలు గడించినప్పటికీ మీనా డీల్ మాత్రం ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోనుంది.
