బేబమ్మ కెరీర్ డిసైడ్ చేసే సినిమాలు..!
తమిళ్ లో మొదట సైన్ చేసిన సినిమా జినీ. రవి మోహన్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తుంది.
By: Ramesh Boddu | 13 Oct 2025 3:06 PM ISTఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో తొలి సినిమాతోనే పాపులర్ అయ్యింది కృతి శెట్టి. ఆ సినిమా తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ వచ్చినా ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన మనమే వరకు కూడా కృతి శెట్టి సినిమా అంటే అది ఫ్లాపే అన్న విధంగా రిజల్ట్ ఉండేది. తెలుగులో స్టార్ డం వస్తే ఆ ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని గుర్తించి ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. ఐతే ఈలోగా కోలీవుడ్ నుంచి ఆఫర్స్ రాగా అవి చేస్తూ వస్తుంది కృతి శెట్టి.
ప్రదీప్ రంగనాథన్ తో L.I.K..
తమిళ్ లో మొదట సైన్ చేసిన సినిమా జినీ. రవి మోహన్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాతో పాటు L.I.K అంటూ ప్రదీప్ రంగనాథన్ తో ఒక యూత్ ఫుల్ మూవీ చేస్తుంది అమ్మడు. విఘ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కార్తితో వా వాతియార్ కూడా చేస్తుంది. ఐతే కృతి శెట్టి లక్కో ఏమో కానీ ఈ 3 సినిమాలు ఒకే మంత్ లో రాబోతున్నాయి.
కార్తి వా వాతియార్ డిసెంబర్ 5 వస్తుంటే.. ప్రదీప్ తో చేసిన ఎల్.ఐ.కె డిసెంబర్ 18న రిలీజ్ అవుతుంది. ఈ రెండిటితో పాటు రవి మోహన్ జినీ కూడా అటు ఇటుగా డిసెంబర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ఈ 3 సినిమాలతో తన టాలెంట్ చూపించబోతుంది అమ్మడు. కృతి శెట్టి కి ఈ 3 సినిమాలే చివరి అవకాశమని చెప్పొచ్చు. వీటిలో ఏది వర్క్ అవుట్ అయినా అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఒకవేళ తేడా వస్తే మాత్రం ఇక కెరీర్ చాలా రిస్క్ లో పడినట్టు అవుతుంది.
3 సినిమాలు ఒకదానికి మించి మరొకటి అనేలా..
ఉప్పెన సినిమా తర్వాత వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చింది కృతి. ఐతే అందులో కథాబలం ఉన్న సినిమాలు ఉన్నా ఎందుకో అమ్మడి బ్యాడ్ లక్ వల్ల వర్క్ అవుట్ కాలేదు. ఐతే తమిళ్ లో రాబోతున్న 3 సినిమాలు ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయి. ఆ సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అయినా కృతికి మళ్లీ మంచి క్రేజ్ వస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉన్నా అది సినిమా సక్సెస్ చేయడానికి సరిపోవట్లేదని మేకర్స్ అమ్మడిని పక్కన పెట్టేశారు.
