కీర్తి సురేష్ బయోపిక్ టైటిల్ అది పెట్టాలట..!
మహానటి సినిమాతో తనలోని మహానటిని ప్రేక్షకులకు పరిచయం చేసి అవార్డులను సైతం అందుకుంది కీర్తి సురేష్.
By: Ramesh Boddu | 19 Oct 2025 12:08 PM ISTమహానటి సినిమాతో తనలోని మహానటిని ప్రేక్షకులకు పరిచయం చేసి అవార్డులను సైతం అందుకుంది కీర్తి సురేష్. మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది కీర్తి సురేష్. ఇక రీసెంట్ గా అమ్మడు ఒక ఇంటర్వ్యూలో తన బయోపిక్ తీస్తే ఎలాంటి టైటిల్ పెట్టాలో చెప్పింది. సీనియర్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్ గా ఒక స్పెషల్ చిట్ చాట్ షో నిర్వహిస్తున్నారు.
పెళ్లి తర్వాత కీర్తి సురేష్..
ఈ చిట్ చాట్ లో ఇప్పటికే చాలామంది స్టార్స్ అటెండ్ అయ్యారు. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా ఆ షోకి వచ్చింది. షోలో జగ్గు భాయ్ ప్రశ్నలకు కీర్తి సురేష్ తెలివైన సమాధానాలు ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఈ క్రమంలో సావిత్రి గారి బయోపిక్ మహానటిలో నువ్వు చేశావ్.. నీ బయోపిక్ చేస్తే దానికి ఏ టైటిల్ పెట్టాలని నువ్వు అనుకుంటున్నావ్ అంటే కాస్త ఆలోచించి ప్రసిద్ధి అని చెప్పింది కీర్తి.
అంటే తన పేరులోని కీర్తి ప్రతిష్ట ప్రసిద్ధి ఇలా వాటికి సూటయ్యేలా టైటిల్ ఎంపిక చేసుకుందన్నమాట. కీర్తి సురేష్ బయోపిక్ చేస్తే కచ్చితంగా ఆ టైటిల్ పెట్టినా డౌట్ పడనక్కర్లేదు. ఈమధ్య కెరీర్ లో కాస్త వెనకపడింది కీర్తి సురేష్. పెళ్లి తర్వాత ఈ బ్రేక్ కామనే అయితే మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది అమ్మడు.
విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్..
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ తో పాటుగా వేణు యెల్దండి ఎల్లమ్మ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో అమ్మడు మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది. కీర్తి సురేష్ కూడా తన ఫోకస్ అంతా ఇప్పుడు ఈ రెండు సినిమాల మీదే పెట్టింది. తమిళ్ లో సినిమాలు కాస్త తగ్గాయి కాబట్టి అవకాశం ఇస్తున్న తెలుగులో మళ్లీ రాణించాలని చూస్తుంది అమ్మడు.
ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తున్న కీర్తి సురేష్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఐతే ప్రస్తుతం కమిటైన సినిమాలతో కీర్తి సురేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసిన కీర్తి సురేష్. మళ్లీ లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా టచ్ చేయాలని చూస్తుంది. ఐతే పూర్తిగా అలాంటి సినిమాలే కాకుండా కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యింది. వేణుతో చేస్తున్న ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
