ఫోటో స్టోరి: 'మన్మథుడు' బ్యూటీ పూల్‌సైడ్ ట్రీట్
అన్షు లగ్జరీ లైఫ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. లేటు వయసులోను గుబులు పుట్టించే అందాలతో ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంబ్యాక్ కోసం ట్రై చేస్తోందని కథనాలొచ్చాయి.
By: Sivaji Kontham | 15 Aug 2025 12:45 PM ISTప్రభాస్, నాగార్జున లాంటి అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించింది అన్షు. `మన్మథుడు`(2002)లో నాగ్ సరసన అద్భుత నటనతో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత మటు మాయమైంది. పరిశ్రమలో కనిపించకపోయేసరికి అసలు ఈ హీరోయిన్ ఏమైంది? అంటూ మీడియాలో చాలా ఊహాజనిత కథనాలు వచ్చాయి. కానీ అన్షు విదేశాలలో సెటిలయ్యారని ఆ తర్వాత చాలా కాలానికి కానీ తెలియలేదు.
అన్షు అందచందాలు ఒడ్డు, పొడుగు చూసి ప్రేమలో పడని యువకుడు లేడు. అందుకే అన్షు ఎక్కడ? అంటూ ఆరాలు తీసారు. రీసెంట్ గానే అన్షు తనకు తానుగానే తన జీవన శైలి ఎలా ఉంటుందో బయటపెడుతూ సోషల్ మీడియాల్లో టచ్ లోకి రావడంతో అభిమానులకు కొంత స్పష్ఠత వచ్చింది.
అన్షు లగ్జరీ లైఫ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. లేటు వయసులోను గుబులు పుట్టించే అందాలతో ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంబ్యాక్ కోసం ట్రై చేస్తోందని కథనాలొచ్చాయి.
తాజాగా అన్షు అందమైన రాయల్ ప్యాలెస్‌లోని పూల్ సైడ్ ఫోటోలతో గుబులు పుట్టించింది. దుబాయ్‌లోని అల్ట్రాలగ్జరీ అట్లాంటిస్ ది రాయల్ ప్యాలెస్ లో చిద్విలాసంగా కనిపిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో రాయల్ బ్లూ స్విమ్‌సూట్ లో అన్షు రూపం ఆకర్షిస్తోంది. నేచురల్ బ్యూటీ అన్షు టోన్డ్ అందాలతో మతులు చెడగొడుతోంది! అంటూ అభిమామానులు వ్యాఖ్యానిస్తున్నారు.
