`స్పిరిట్` లో అడిగిన వాళ్లకు ఛాన్స్ లేదా?
యువ సంచలనం సందీప్ రెడ్డి వంగా సినిమాలో ఛాన్స్ కోసం నటీనటుల మద్య ఎలాంటి పోటీ ఉందో? చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 23 Nov 2025 3:15 PM ISTయువ సంచలనం సందీప్ రెడ్డి వంగా సినిమాలో ఛాన్స్ కోసం నటీనటుల మద్య ఎలాంటి పోటీ ఉందో? చెప్పాల్సిన పనిలేదు. సందీప్ సినిమాలో ఛాన్స్ కావాలంటూ అతడికి దరఖాస్తులే పెడుతున్నారు. తన దర్శకత్వంలో చిన్న వేషం ఇచ్చినా చాలు అంటూ రెడీ అంటున్నారు. మంచు విష్ణు కూడా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. `స్పిరిట్` చిత్రంలో చిన్న ఛాన్స్ ఇచ్చినా? చేస్తానంటున్నాడు. ఎందుకంటే అతడి దర్శకత్వంలో నటిస్తే నటుడిగా వచ్చే గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. సందీప్ ఎలాంటి పాత్రనైనా స్ట్రాంగ్ గా చెబుతాడు.
నటుల ఎంపికలో రాజీ పడని డైరెక్టర్:
తెరపై ఉన్నంత సేపు ఓ వైబ్ కనిపిస్తుంది. దర్శకుడు అనీల్ రావిపూడి కూడా నటించాల్సి వస్తే? అతడి సినిమాలో నటించాలని ఉందనే ఆసక్తిని ఓ సందర్భంలో వ్యక్తం చేసాడు. ఇలా ఆశపడే వారెంతో మంది ఉన్నారు. తమకు అందుబాటులో ఉన్న వేదికల ద్వారా సందీప్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కానీ ఛాన్స్ అంత సులభం కాదు. సందీప్ రాసిన పాత్రకు ఏ నటుడైతే సూటవుతాడో? వాళ్లనే తీసుకుంటాడు. ఆ విషయంలో ఎంత మాత్రం రాజీ పడడు. కాస్టింగ్ విషయంలో అతడి వద్ద ఎలాంటి రికమండీషన్లు పనిచేయవు. హీరోయిన్ పాత్ర అయినా? తన సినిమాలో హీరోయిన్ అవ్వాలంటే ఆమె పెద్ద స్టార్ కావాల్సిన పనిలేదు.
ఆ పాత్రలో మాలీవుడ్ నటుడా?
ఎలాంటి ఇమేజ్ లేని నటిని తీసుకుని సంచలనం చేయగల దిట్ట. `స్పిరిట్` సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే త్రిప్తీ డిమ్రీ ఎంపికైంది. ఈ పాత్ర కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. దీపికా పదుకొణే నో చెప్పడంతో త్రిప్తిని వరించింది ఆ ఛాన్స్. తాజాగా ఓ పవర్ పుల్ పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను రాసిన పాత్రకు లాల్ మాత్రమే పర్పెక్ట్ గా సూటవుతున్నాడని ఈనేపథ్యంలో ఆయన్నే తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
జపాన్ టూర్ అనంతరం డార్లింగ్:
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయనున్నారు. ప్రభాస్ సహా ప్రధాన పాత్రలపై ఈ సన్నివేశాలు చిత్రీకరిం చనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ ఇంకా జాయిన్ అవ్వలేదు. `పౌజీ` షూటింగ్ లో బిజీగా ఉండటంతో? వీలు పడలేదు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ జపాన్ వెళ్లనున్నాడు. అక్కడ నుంచి తిరిగొచ్చిన తర్వాత `స్పిరిట్` షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఈలోపు మోహన్ లాల్ ఎంట్రీపై కూడా పూర్తి క్లారిటీ రానుంది.
