Begin typing your search above and press return to search.

కబాలి పాపతో విశాల్ ఎంగేజ్‌మెంట్

కోలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ వ్యక్తిగత జీవితంపై ఎప్పటినుంచో ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.

By:  M Prashanth   |   29 Aug 2025 2:37 PM IST
కబాలి పాపతో విశాల్ ఎంగేజ్‌మెంట్
X

కోలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ వ్యక్తిగత జీవితంపై ఎప్పటినుంచో ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు తరచూ ఆయనను "ఎప్పుడు సెట్ అవుతారు?" అని ప్రశ్నించేవారు. ఇదే సమయంలో పలు హీరోయిన్లతో గాసిప్స్ వచ్చినా ఆ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలాయి.

ఇలాంటి సమయంలో విశాల్ తన 47వ పుట్టిన రోజు సందర్భంగా జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటి సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆగస్టు 29న జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ శుభవార్తను షేర్ చేయడంతో అభిమానులు, సినీ వర్గాలు విషెస్ చెబుతున్నారు.

విశాల్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. "నా జీవితంలోకి అడుగుపెట్టిన ఈ శుభకార్యంలో మీ అందరి ఆశీస్సులు కావాలి" అంటూ పోస్ట్ చేసిన, ధన్సికతో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాల్‌కు ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఫ్యామిలీ లో కూడా ఒక ఎమోషనల్ మూమెంట్‌గా మారింది.

ఇక సాయి ధన్సిక కెరీర్ విషయానికి వస్తే 2009లో పేరణ్మాయి సినిమా ద్వారా మొదలైంది. తరువాత అరవణ్, పరదేశి వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ కబాలిలో ఆయన కూతురిగా నటించడం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా షికారు వంటి సినిమాల ద్వారా దగ్గరయ్యారు. ఇప్పుడు విశాల్‌తో బంధం కుదుర్చుకోవడం ఆమె కెరీర్‌కే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా కొత్త మలుపు.

గత కొన్నేళ్లుగా విశాల్ ధన్సిక లవ్ స్టోరీపై ఊహాగానాలు వినిపించాయి. ఒక ఈవెంట్‌లో విశాల్ స్వయంగా ధన్సికను తన జీవిత భాగస్వామిగా ప్రకటించడంతో ఆ వార్తలు నిజమని తేలింది. అయితే నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చేసిన శపథం వల్ల ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చిన విశాల్ తన మాట నిలబెట్టుకున్నారు. మొత్తం మీద విశాల్ సాయి ధన్సిక ఎంగేజ్‌మెంట్ వార్త సినీ వర్గాలలోనే కాదు, అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే పెళ్లి తేదీ కూడా ప్రకటించనున్నారని సమాచారం.