శింబు ఇప్పటికీ వారితో టచ్‌లోనే ఉన్నాడా?
అంతే కాకుండా లవ్ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు కూడా అక్కడే ఎక్కువగా వినిపించేవి.. అదే వాతావరణం కోలీవుడ్‌కు మారింది. అది కూడా స్టార్ హీరో శింబు వల్ల.
By: Tupaki Entertainment Desk | 18 Dec 2025 4:10 PM ISTలవ్ ఎఫైర్స్.. బ్రేకప్స్.. రూమర్స్.. ఇవి బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన పేర్లు. కొత్త జంట కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోందంటే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందనే వార్తలు అప్పట్లో బాలీవుడ్‌లో సర్వసాధారణం. అంతే కాకుండా లవ్ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు కూడా అక్కడే ఎక్కువగా వినిపించేవి.. అదే వాతావరణం కోలీవుడ్‌కు మారింది. అది కూడా స్టార్ హీరో శింబు వల్ల. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శింబు ఆ తరువాత హీరోగా మారి క్రేజీ హిట్‌లని సొంతం చేసుకున్నాడు.
అంతే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, గాయకుడిగానూ పాపులర్ అయ్యాడు. అంతే స్థాయిలో లవర్ బాయ్‌గానూ పేరు తెచ్చుకున్న శింబు కోలీవుడ్‌లో లవ్ ఎఫైర్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే శింబు నయనతార, త్రిష, హన్సిక, ఐశ్వర్య ధనుష్, హర్షిక, వరలక్ష్మీ శరత్ కుమార్, ఆండ్రియా, నిధీ అగర్వాల్ వంటి క్రేజీ హీరోయిన్‌లతో లవ్ ఎఫైర్స్ నడిపించాడు.
ఈ లిస్ట్‌లో నయనతార, హన్సికలతో పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే. నయనతారతో డీప్ లవ్‌స్టోరీ నడిపిన శింబు ఆ తరువాత తనతో బ్రేకప్ చేసుకోవడం.. ఇద్దరూ విడిపోవడం తెలిసిందే. హన్సికతోనూ అదే పంథాలో లవ్ స్టోరీ రన్ చేశాడు. త్వరలోనే ఇద్దరూ పెళ్లి పీటలెక్కుతారని అంతటా ప్రచారం జరిగింది. శింబు తండ్రి రాజేందర్ కూడా వీరి పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, హన్సిక ఫ్యామిలీ సై అనడమే బ్యాలెన్స్ అని అంతా ఓకే అంటే ఇక పెళ్లే అని వార్తలు షికారు చేశాయి.
కట్ చేస్తే బ్రేకప్..ఎవరి దారి వారు చూసుకున్నారు. కొంత కాలం శింబు డిప్రెషన్‌తో బరువు పెరిగి సినిమాలు తగ్గించుకున్నాడు. దీంతో కెరీర్ డౌన్ అయింది. అయితే ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శింబు మాజీ ప్రేయసుల గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. తనది ట్రూ లవ్ అని చెప్పిన శింబు బ్రేకప్ తరువాత తను లవ్ చేసిన వారితో టచ్‌లో లేకపోయినా మాట్లాడాల్సిన సందర్భం వస్తే కచ్చితంగా మాట్లాడతానని, వాళ్లు కూడా తనపై హేట్‌ని పెంచుకోలేదని, తనతో మాట్లాడుతారని చెప్పుకొచ్చాడు.
బ్రేకప్ తరువాత నేను వాళ్లపై, వాళ్లు నాపై ద్వేషం పెంచుకోలేదని, అంతా ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉంటారని శింబు చెప్పాడు. ఇదిలా ఉంటే శింబు ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్‌లో `వడాచెన్నై`కి సీక్వెల్‌గా రూపొందుతున్న `అరసన్`లో నటిస్తున్నాడు. దీన్నే తెలుగులో `సామ్రాజ్యం` పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
