Begin typing your search above and press return to search.

Tupaki Exclusive : ఏ మీడియం అయినా దానికి తగ్గట్టుగా యాక్టింగ్ ను మార్చుకోవాలట!

ప్రస్తుతం ఆయన మండాడిలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా Tupakiకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన రోల్, సినీ జర్నీ, అనుభవాల గురించి రవీంద్ర విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

By:  M Prashanth   |   8 Sept 2026 8:24 PM IST
Tupaki Exclusive : ఏ మీడియం అయినా దానికి తగ్గట్టుగా యాక్టింగ్ ను మార్చుకోవాలట!
X

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ రవీంద్ర విజయ్. దూత, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన మండాడిలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా Tupakiకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన రోల్, సినీ జర్నీ, అనుభవాల గురించి రవీంద్ర విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మండాడిలో తన పాత్ర పేరు సింగారం అని రవీంద్ర విజయ్ తెలిపారు. పడవల పోటీ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని ప్రాంతాలు, యాక్షన్ సీన్స్ తో మూవీ తెరకెక్కిందన్నారు. సూరి, సుహాస్ రోల్స్ మధ్య అనేక సీన్స్ ఉంటాయని.. వాటి మధ్య తన రోల్ ఒక స్టేబుల్ వ్యక్తిలా ఉంటుందని చెప్పారు. సింగారం పాత్రకు మంచి జర్నీ, ఎమోషన్ ఉంటుందని పేర్కొన్నారు. తాను థియేటర్ నుంచి వచ్చినంత మాత్రాన మంచి నటుడిగా మారిపోతారని అనుకోవడం సరికాదని అన్నారు.

సినిమా, డ్రామా.. ఏ మీడియం అయినా దానికి తగ్గట్టుగా యాక్టింగ్ ను మార్చుకోవాలని తెలిపారు. కెమెరా ముందు ఎలా ఉండాలి, లెన్స్‌ ను ఎలా యూజ్ చేసుకోవాలి వంటి టెక్నికల్ విషయాలు తెలుసుకోవడం ముఖ్యమన్నారు. తాను నాలుగు భాషల్లో నటించానని, భాష ఏదైనా కెమెరా ముందుండటమే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మాలీవుడ్ ఇండస్ట్రీలో వర్క్ తక్కువ బడ్జెట్‌ తో జరుగుతుందని వివరించారు.

అక్కడ స్టోరీ, రైటింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలిపారు. హిందీ చిత్రాల్లో ది ఫ్యామిలీ మ్యాన్, జవాన్ వంటి చిత్రాల్లో పనిచేశానని, వాటిలో సింక్ సౌండ్ పద్ధతిలోనే షూటింగ్ జరిగిందన్నారు. సింక్ సౌండ్‌ లో నటించేటప్పుడు సెట్లో చాలా డిసిప్లిన్ అవసరమని రవీంద్ర విజయ్ చెప్పారు. నటీనటులందరూ తమ డైలాగులు ముందుగానే తెలుసుకుని రావాలని.. సెట్లో సౌండ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అయితే సింక్ సౌండ్ వల్ల ఎమోషన్స్ మరింత క్లియర్ గా కనిపిస్తాయని పేర్కొన్నారు.

తనకు వరుసగా సినిమాలు విడుదల కాకపోవడం వల్ల గ్యాప్ కనిపిస్తోందని, కానీ ప్రస్తుతం చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌ లు షూటింగ్, విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కొన్ని ప్రాజెక్టులు ఇంకా ప్రకటించలేదని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేతిలో ఉన్నాయని, 2026 చివరి నుంచి 2027 వరకు బిజీగా ఉంటానని చెప్పారు. పాత్రల ఎంపిక విషయంలో పారితోషికానికే ఇంపార్టెన్స్ ఇవ్వనని స్పష్టం చేశారు. తనకు నచ్చిన, ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటానన్నారు.

ఒకే తరహా పాత్రలు చేస్తే తనకే బోర్ కొడుతుందని, అది ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుందని చెప్పారు. కథ, రోల్ తనకు నచ్చితే చిన్న మూవీ అయినా, పెద్ద సినిమా అయినా చేయడానికి సిద్ధమేనన్నారు. ఇక మండాడి షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. సముద్రం మధ్య, తీర ప్రాంతాల్లో చాలా కష్టపడి షూటింగ్ జరిపామని చెప్పారు. పడవలు పలుమార్లు తిరగబడటం, కెమెరాలు, లెన్స్‌ లు దెబ్బతినడం జరిగిందన్నారు.

ప్రకృతితో పోరాడుతూ సుహాస్, సూరి సహా మూవీ టీమ్ షూటింగ్ పూర్తి చేసిందని తెలిపారు. సుహాస్, సూరి వంటి నటుల జర్నీ ఎంతో ఇన్స్పిరేషన్ అని రవీంద్ర విజయ్ అన్నారు. సెట్లో అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా ఉన్నామని చెప్పారు. సూరి తన ఫీలింగ్స్ ను అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరని ప్రశంసించారు. సత్యరాజ్‌ తో కలిసి పనిచేయడం సరదాగా ఉంటుందని, ఎంత సీరియస్ సీన్ అయినా ఆయనతో నవ్వకుండా ఉండలేమని చెప్పారు.