ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ ఇంత సైలెంట్ గానా?
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు యాంగ్రీస్టార్ రాజశేఖర్ హీరో కెరీర్ తిరుగు లేకుండా సాగింది.
By: Srikanth Kontham | 28 Aug 2025 4:00 PM ISTదాదాపు నాలుగు దశాబ్దాల పాటు యాంగ్రీస్టార్ రాజశేఖర్ హీరో కెరీర్ తిరుగు లేకుండా సాగింది. అతడి కంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఆ ఇమేజ్ తో కొన్నాళ్ల పాటు హీరోగా ఎంతో బిజీగా కెరీర్ సాగింది. కాల క్రమంలో పరాజయాలు అతడి మార్కెట్ ప్రభావం చూపించాయి. దీంతో హీరో అవకాశాల తగ్గాయి. ఇది గ్రహించిన ఇండస్ట్రీ నటుడిగా అవకాశాలు కల్పించింది అన్నది కాదనలేని వాస్తవం. హీరోగా అవకాశాలు లేని సమయంలో ఇతర స్టార్లు తమ చిత్రాల్లో కీలక పాత్రలు ఎన్నో ఆపర్ చేసారు.
వచ్చినా వదులుకున్న నటుడు:
కానీ రాజశేఖర్ మాత్రం సున్నితంగా వాటిని తిరస్కరించారు. నటుడిగా హీరోగా మాత్రమే చేయాలి అనే అతని కోరికను కాదనలేని చాలా మంది తర్వాత కాలంలో వెనక్కి తగ్గారు. అలా కొన్ని అవకాశాలు కోల్పో యారు. అయితే `శేఖర్` సినిమా తర్వాత రాజశేఖర్ లో రియలైజేషన్ కనిపించింది. దీంతో నితిన్ హీరోగా నటించిన `ఎక్స్ ట్రా ఆర్డనరీ` మ్యాన్ లో ఐజీ విజయ్ చక్రవర్తి అనే కీలక పాత్రలో కనిపించారు. అదే రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన తొలి సినిమా. కానీ ఆ సినిమా పరాజయం చెందింది.
ఏది నిజం? ఏది అబద్దం?
అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజశేఖర్ మరో సినిమా చేయలేదు. ఆయన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. హీరోగానైనా కొత్త సినిమాలు ఏవైనా చర్చల దశలో ఉన్నాయా? అంటే అదీ కనిపిచడం లేదు. అలాటిది ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. కానీ ఆ చాన్స్ కూడా లేదు. మరి వస్తోన్న ఛాన్సులు ఆయన వద్దనుకుంటున్నారా? లేక అవకాశాలు రాక సినిమాలు చేయడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి హీరో అవకాశాలు ఆశించినా రావడం కష్టం.
అవకాశాలు లేక ఖాళీగా:
ఫేం ఉన్నంత కాలమే హీరో ఛాన్సులు క్యూలో ఉంటాయి. ఆ ఫేం కోల్పోతే ఆ తరహా అవకాశాలకు ఎంత మాత్రం అవకాశం లేదు. అయితే రాజశేఖర్ హీరోగా నటించిన చాలా సినిమాలు ఆయన సొంత బ్యానర్లోనే నిర్మాణం జరిగాయి. అయితే వైఫల్యాలు సదరు సంస్థను నష్టాల్లోకి నెట్టాయని గతంలోనే మీడియాలో కథనాలొచ్చాయి. లేదంటే జీవిత రాజశేఖర్ లు సొంత బ్యానర్లో ఓ సినిమా ప్రారంభించేవారని ప్రచారం జరిగింది. అటు కుమార్తెలు అయినా బిజీగా ఉన్నారా? అంటే అదీ కనిపించలేదు. కుమార్తలిద్దరు హీరోయిన్లగా లాంచ్ అయినా? అవకాశాలు మాత్రం రావడం లేదనే ప్రచారం ఇప్పటికే ఉంది.
