60 కోట్లు.. ధనుష్ 'ఖరీదైన' పిచ్చి వెనుక ఇంత కథ ఉందా!
మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండటం సహజం. కొందరికి బైక్స్ అంటే ఇష్టం, ఇంకొందరికి షూస్ అంటే క్రేజ్. కానీ ధనుష్ కు మాత్రం చేతి గడియారాలంటే విపరీతమైన మోజు.
By: M Prashanth | 25 Nov 2025 11:06 AM ISTసాధారణంగా సినిమా స్టార్ల లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుంది. కార్లు, బంగ్లాలు, ఫారిన్ ట్రిప్పులు.. ఇలా వాళ్ళ ప్రపంచమే వేరు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం బయట చాలా సింపుల్ గా కనిపిస్తారు. పంచె కట్టు, కాటన్ షర్ట్ తో సాదాసీదాగా ఉండే ఆయన వెనుక ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఖరీదైన హాబీ దాగి ఉంది. ఇన్నాళ్లు ఎవరికీ తెలియని ఆ సీక్రెట్ ఇప్పుడు బయటపడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండటం సహజం. కొందరికి బైక్స్ అంటే ఇష్టం, ఇంకొందరికి షూస్ అంటే క్రేజ్. కానీ ధనుష్ కు మాత్రం చేతి గడియారాలంటే విపరీతమైన మోజు. ఈ విషయం రీసెంట్ గా జరిగిన ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనుకోకుండా బయటపడింది. ఆ ఇంటర్వ్యూలో ధనుష్ చేతికి ఉన్న వాచ్ చూసిన రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఆ రిపోర్టర్ వెంటనే ధనుష్ ను, "సార్.. మీ చేతికి ఉన్న వాచ్ ఖరీదు దాదాపు రూ. 2.5 కోట్లు కదా?" అని అడిగాడు. దానికి ధనుష్ నవ్వి ఊరుకున్నారు తప్ప ఖండించలేదు. ఆ ఒక్క ప్రశ్నతో ధనుష్ వాచ్ కలెక్షన్ గుట్టు రట్టయింది. ధనుష్ దగ్గర ఉన్న వాచ్ ల చిట్టా వింటే సామాన్యులకు కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎందుకంటే ఆయన దగ్గర ఒకట్రెండు కాదు, చాలా అరుదైన వాచ్ ల కలెక్షన్ ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ దగ్గర ఉన్న మొత్తం వాచ్ ల విలువ దాదాపు రూ. 50 నుంచి 60 కోట్లు ఉంటుందట. రిచార్డ్ మిల్లె, పటేక్ ఫిలిప్ వంటి అత్యంత ఖరీదైన బ్రాండ్ వాచీలు ఆయన వార్డ్ రోబ్ లో ఉన్నాయి. అంటే ఆయన చేతికి పెట్టుకునే వాచీల విలువతో ఒక మీడియం రేంజ్ సినిమాను తీసేయొచ్చన్నమాట.
అంత సింపుల్ గా కనిపించే ధనుష్, వాచీల విషయంలో మాత్రం ఇంత కాస్ట్లీనా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడే ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంది. ధనుష్ దగ్గర ఇన్ని కోట్ల విలువైన వాచీలు ఉన్నా, ఆయనకు ఎప్పటికీ స్పెషల్ మాత్రం చిన్నప్పుడు అమ్మ కొనిచ్చిన వాచీనేనట. స్కూల్ డేస్ లో అమ్మ కొనిచ్చిన ఆ ప్లాస్టిక్ డిజిటల్ వాచ్ ఖరీదు వంద రూపాయల లోపే.
బ్యాటరీ అయిపోయినా, టైం చూపించకపోయినా కేవలం అమ్మ మీదున్న ప్రేమతో దాన్ని స్కూల్ కు వేసుకుని వెళ్లేవారట. ఇప్పుడు కోట్ల సంపద ఉన్నా, స్టార్ డమ్ వచ్చినా.. ఆ వంద రూపాయల ప్లాస్టిక్ వాచ్ ను మాత్రం ధనుష్ ఇప్పటికీ పదిలంగా దాచుకున్నట్లు చెప్పారు. ఇన్ని ఖరీదైన వాచీలు తన చేతికి అందాన్ని ఇస్తాయేమో కానీ, అమ్మ ఇచ్చిన ఆ వాచ్ మాత్రం ఆనందాన్ని ఇస్తుందని ధనుష్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
