వేడుకల్లో పాల్గొనలేదు.. జైల్లో రాత్రంతా నిద్రపోలేదు!
కన్నడ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ మళ్లీ జైలు పాలైన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 16 Aug 2025 10:58 AM ISTకన్నడ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ మళ్లీ జైలు పాలైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీం కోర్టు రద్దు చేయడంతో మళ్లీ చెరసాలలో చేరారు. అరెస్ట్ అయి ఇప్పటికి మూడు రోజులవుతుంది. బెంగుళూరు సెంట్రల్ జైలుకు దర్శన్ ని, పవిత్రా గౌడ్ ను మహిళా జైలుకు తరలించారు. అయితే శుక్రవారం జైలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దర్శన్ హాజరు కాలేదు. రాత్రంతా మేల్కొని ఉన్నట్లు సమాచారం. అతడితో పాటు అదే జైల్లో క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఖైదీ చేయబడ్డారు.
అతడు కూడా వేడుకల్లో పాల్గొనలేదు. దర్శన్ కు మానసిక సమస్యలు కూడా ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. హత్య చేయడాని కి కారణంగా కూడా అతడిలో ఉన్న విపరీతమైన కోపమని మానసిక వైద్యులు పేర్కొన్నారు. ఒక్కసారిగా బెయిల్ రద్దై మళ్లీ జైలుకు వెళ్లడంతో దర్శన్ మరోసారి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ బెయిల్ రద్దవ్వగానే నటి రమ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. చట్టం ముందు అంతా సమానమనే స్పష్టమైన సందేశం కోర్టు ద్వారా వచ్చిందన్నారు.
మన పని మనం చేయాలి. చివరిలో ఆశ , వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. న్యాయం అందరికీ దక్కుతుందన్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దర్శన్ కు మద్దతుగా పెట్టిందా? మరో కారణంతో పెట్టిందా? అన్నది అభిమానులకు అర్దం కాలేదు. అభిమాని రేణుకా స్వామి హత్య చేసాడనే ఆరోపణలతో మొత్తం 15 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
పవిత్రా గౌడ్ కు రేణుకాస్వామి అసభ్య సందేశాలు పంపించాడన్న కారణంతో దర్శన్ దాడి చేసినట్లు ఆరోప ణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు కోర్టులో ప్రవేశ పెట్టారు. అయినా హై కోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు బెయిల్ రద్దు చేయాలని..మరింత విచారణ అసరమని కోర్టును ఆశ్రయించారు. అయినా బెయిల్ రద్దవ్వలేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ రద్దవ్వడంతో కథ మళ్లీ మొదటి కొచ్చింది.
