హీరోల ఉన్నావు... ఇద్దరి మధ్య వ్యవహారానికి సాక్ష్యం
టీం ఇండియా యంగ్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ పేరు ప్రస్తుతం మారు మ్రోగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ దుమ్ము లేపుతున్నాడు.
By: Ramesh Palla | 27 Sept 2025 7:15 AM ISTటీం ఇండియా యంగ్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ పేరు ప్రస్తుతం మారు మ్రోగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ దుమ్ము లేపుతున్నాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్‌గా నిలిచాడు. నేడు జరగబోతున్న మ్యాచ్‌తో పాటు, పాకిస్తాన్‌తో జరగబోతున్న ఫైనల్ మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ మినిమం పరుగులు సాధిస్తే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అభిషేక్ శర్మను ఆకాశానికి ఎత్తుతూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో అభిషేక్ శర్మ రెగ్యులర్‌గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. ఆటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి, కొన్ని మోడలింగ్ ఫోటోలను సైతం ఆయన షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం.
క్రికెటర్ అభిషేక్ శర్మ ఫోటో వైరల్
ఇటీవల ఆయన షేర్ చేసిన ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నప్పుడు అంతగా అనిపించడు, జెర్సీలో అంత అందంగా కనిపించడు కానీ, అభిషేక్ శర్మను ఇలా చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హీరో రేంజ్‌లో మేకోవర్‌తో పాటు, ఔట్ ఫిట్ ను ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆకట్టుకునే రూపంతో పాటు, మంచి ఫిజిక్ అభిషేక్ సొంతం. అందుకే చాలా మంది అభిషేక్‌ను క్రికెటర్‌గా కంటే హీరోగా సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ముగిసిన తర్వాత అయినా అభిషేక్ హీరోగా సినిమాను చేయాలని చాలా మంది అంటున్నారు. అభిషేక్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సైతం ఈ ఫోటోకు కామెంట్ చేయడంతో మరింతగా ఈ ఫోటో వైరల్ అయింది.
లైలా ఫైసల్‌తో అభిషేక్ ప్రేమలో..
గత కొన్నాళ్లుగా అభిషేక్ శర్మ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన కశ్మీరీ ముస్లీం ఫ్యామిలీకి చెందిన లైలా ఫైసల్ తో ఈయన ప్రేమాయణం సాగిస్తున్నాడని జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ విషయాన్ని ఇద్దరూ నిర్ధారించలేదు. కానీ తాజాగా అభిషేక్ శర్మ షేర్ చేసిన ఫోటోకు లైలా ఫైసల్ కామెంట్ చేసింది. అది కూడా బాగుంది, లేదంటే ఈమోజీని షేర్ చేయడం కాకుండా హీరోలా ఉన్నావు అంటూ కామెంట్ పెట్టడం ద్వారా ఇద్దరి మధ్య వ్యవహారం ఉంది, ఇద్దరి ప్రేమకు లైలా చేసిన కామెంట్ సాక్ష్యం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోకు లైలా చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, ఇతర మీడియా వర్గాల వారు సైతం ఈ కామెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఆసియా కప్‌లో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్
లైలా ఫైసల్ వ్యాపారంలో ఉంది. ఆమె తండ్రి ఇండియాలోనే టాప్ బ్రాండ్ హోమ్ థియేటర్ సిస్టమ్స్ మరియు ఏఐ సొల్యూషన్ కంపెనీని రన్ చేస్తున్నాడు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కంపెనీ నడిపిస్తున్న లైలా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి త్వరలోనే అభిషేక్ శర్మ గురించి ఒక క్లారిటీ వస్తుందని అంతా నమ్ముతున్నారు. అప్పటి వరకు ఈ కామెంట్‌తోనే అధికారిక ప్రకటన అనుకోవాల్సిందే అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ ఏడాదిలో మంచి ఫామ్ తో కొనసాగుతున్నాడు. ఆసియా కప్ ప్రదర్శనతో రాబోయే మూడు నాలుగు ఏళ్లలో అభిషేక్ శర్మ టీం ఇండియా స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలిచే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ అభిషేక్ కి కెరీర్ బెస్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
