విజయ్ మాట ఇచ్చి మూడేళ్లు.. ఇప్పటికీ స్పందించలేదంటున్న నిర్మాత!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 3 July 2026 11:18 AM ISTటాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా వల్ల తనకు భారీగా నష్టాలు వచ్చాయని, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి విజయ్ తన బ్యానర్‌లో సినిమా చేస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థలు, ఇన్వెస్టర్లను మోసం చేసే ప్రయత్నాలు చేసే వారికి ఈ తీర్పు స్ట్రాంగ్ వార్నింగ్‌గా పనిచేస్తుందని సినీ నిపుణులు అంటున్నారు.
పాత గొడవను తవ్విన నిర్మాత:
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ తాజాగా దర్శకుడిగా మారి నాగబంధం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పాత విషయాలను గుర్తుచేసుకుంటూ విజయ్ దేవరకొండపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది.
భారీ నష్టాలు తెచ్చిన సినిమా అంటే విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ’నే ముందుగా గుర్తుకు వస్తుంది. ఇక క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో, కేఎస్ రామారావు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా అభిషేక్ నామ వ్యవహరించారు. సినిమా అస్సలు మూవీ ఫెయిల్ అవ్వడంతో పెద్ద మొత్తంలో నష్టాలు ఎదురయ్యాయని ఆయన ఓపెన్‌గా చెప్పేశారు.
రూపాయి అడగలేదు.. కానీ:
"సినిమా ఫ్లాప్ అయి మాకు అంత నష్టం వచ్చినా, మేము విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదు. కానీ, ఆ నష్టాన్ని కాస్తయినా రికవర్ చేసుకోవడానికి మా బ్యానర్‌లో ఆయన ఒక సినిమా చేస్తాడని ఆశపడ్డాం" అని అభిషేక్ నామ చెప్పుకొచ్చారు.
మూడేళ్ల ఎదురుచూపులు.. శూన్యం:
ఆ ఒక్క నమ్మకంతోనే విజయ్ దేవరకొండ సినిమా కోసం తాము ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఓపికగా ఎదురుచూశామని నిర్మాత చెప్పారు. కానీ ఇప్పటివరకు విజయ్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ గానీ, స్పందన గానీ లేదని ఆయన బాధపడ్డారు. ఇక హీరోలు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వివాదం మరోసారి ఇలా తెరపైకి రావడం సంచలనంగా మారింది. మరి నిర్మాత అభిషేక్ నామ చేసిన ఈ బిగ్ స్టేట్‌మెంట్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో, ఈ వివాదానికి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.
