Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ కోసం లెజెండ్ త‌న‌యుడా?

బాలీవుడ్ స్టార్లు అంతా ఇప్పుడు తెలుగు సినిమా స్టార్లతో క‌లిసి న‌టించాల‌ని ఆశ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   18 Sept 2025 1:03 PM IST
ప్ర‌భాస్ కోసం లెజెండ్ త‌న‌యుడా?
X

బాలీవుడ్ స్టార్లు అంతా ఇప్పుడు తెలుగు సినిమా స్టార్లతో క‌లిసి న‌టించాల‌ని ఆశ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండ‌యా చిత్రాల్లో ఛాన్స్ ఇవ్వాలే గానీ దూకేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ లెజెండ్ అమితా బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ కి బ‌చ్చ‌న్ కూడా రెడీ అవుతున్నాడు. ఈయ‌న ఏకంగా ఛాన్స్ క‌న్ప‌మ్ చేసుకున్న‌ట్లే తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్వాస్ పై `పౌజీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

కీల‌క పాత్ర‌లో అల‌రించేలా:

భారీ వార్ అండ్ ల‌వ్ స్టోరీ ఇది. భార‌త‌దేశానికి స్వాతంత్య్రం రాక ముందు యుద్దాన్ని..అందులో అద్భుత‌మైన ప్రేమ క‌థ‌ని చూపించ‌బోతున్నాడు. ఈసినిమాకు సంబంధించి న‌టీనటుల వివ‌రాలు మొదటి నుంచి గొప్యంగానే ఉన్నాయి. ప్ర‌భాస్ త‌ప్ప ఇంకేవ‌రి పేర్లు పెద్ద‌గా హైలైట్ కాలేదు. ఈనేప‌థ్యంలో ఇదే ప్రాజెక్ట్ లో ఓ కీల‌క పాత్ర‌లో అభిషేక్ బ‌చ్చ‌న్ ఎంపికైన‌ట్లు తెలిసింది. ద‌ర్శ‌కుడి ఆదేశాల మేర‌కు నిర్మాణ వ‌ర్గాలు అభిషేక్ కి ట‌చ్ లోకి వెళ్ల‌డం..ఆయ‌న్ని ఒప్పించ‌డం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

నాన్న లాగే త‌న‌యుడు కూడా:

దీనికి సంబంధించి ఇంత వ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు గానీ బాలీవుడ్ స‌హా టాలీవుడ్ మీడియాలో ఈ వార్త దావానాలా వ్యాపించింది. ఇదే నిజ‌మైతే తండ్రీ కొడుకులిద్ద‌రు ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించిన స్టార్లు అవుతారు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన `క‌ల్కి 2898`లో కీల‌క‌మైన అశ్వ‌థామ పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. `క‌ల్కి` లో చెప్పుకోవ‌డానికే ప్ర‌భాస్ హీరో త‌ప్ప అందులో అసలైన హీరో అమితాబ‌చ్చ‌న్ అన్న‌ది సినిమా చూసిన వారి అభిప్రాయం. అంత బ‌ల‌మైన పాత్ర పోషించారు.

టాలీవుడ్ డెబ్యూకి రైట్ టైమ్:

తాజాగా త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా డార్లింగ్ సినిమాలో భాగ‌మ‌వుతుండ‌టం మ‌రింత ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి. బాలీవుడ్ లో ఓ పెద్ద స్టార్ వార‌సుడిగా అభిషేక్ బ‌చ్న్ఎంట్రీ ఇచ్చినా? హీరోగా అనుకున్న స్థాయికి చేర‌లేదు. ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. అలాగ‌ని హీరో ఛాన్సులు వ‌దులుకోలేదు. వాటితో బిజీగా ఉంటూనే కీల‌క పాత్ర‌ల‌తోనూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి అభిషేక్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం ఇంట్రెస్టింగ్. ఈ ఛాన్స్ నిజ‌మై స‌క్సెస్ అయితే బాలీవుడ్ లో సాధించ‌లేనిది టాలీవుడ్ లో సాధించే అవ‌కాశం లేక‌పోలేదు. అభిషేక్ బ‌చ్చ‌న్ టాలీవుడ్ ఎంట్రీకి కూడా ఇంత‌కు మిచంఇన‌ స‌రైన స‌మ‌యం ఏముంటుంది.