అభిషేక్ బ్రాడ్ ఫిట్ అయితే? ఐశ్వర్యా రాయ్ ఏంజలినా జోలీ!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక జంటలలో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు అగ్రస్థానంలో నిలుస్తారు.
By: Srikanth Kontham | 5 Oct 2026 8:49 AM ISTబాలీవుడ్ ప్రతిష్ఠాత్మక జంటలలో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు అగ్రస్థానంలో నిలుస్తారు. బాలీవుడ్‌లో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ జంటకు విశేషమైన గుర్తింపు ఉంది. ఇద్దరు కలిసి నటించిన సినిమాలు, వారి వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ అభిమానులతో పాటు మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ జంట ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రాచుర్యం పొందిం దంటే? అంతర్జాతీయ మీడియా సైతం ఈ జోడిని ఇండియన్ బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ (బ్రాంజెలీనా) అని అభివర్ణించింది.
హాలీవుడ్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే తన షోలో అభిషేక్, ఐశ్వర్యలను ఆహ్వానించిన సమయంలో వారిని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన దంపతులలో ఒకరిగా పరిచయం చేశారు. ఈ పోలిక అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఇద్దరి ప్రయాణం వెండితెరపై ప్రారంభమై నిజ జీవిత భాగస్వాములుగా మారింది. `గురు`, `ధూమ్ 2`, `సర్కార్ రాజ్`, `రావణ్` వంటి చిత్రాలలో ఈ జోడీ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా దర్శకుడు మణిరత్నం రూపొందించిన `గురు` సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడి, పెళ్లికి దారితీసింది.
2007లో జరిగిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం సినీ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన వేడుకలలో ఒకటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల సమక్షంలో జరిగిన వేడుకను ప్రపంచవ్యాప్తంగా మీడియా కవర్ చేసింది. బాలీవుడ్ పెద్దల నుంచి అంతర్జాతీయ ప్రముఖుల వరకు అందరి దృష్టి ఈ పెళ్లిపైనే నెలకొంది.
బచ్చన్ కుటుంబ నేపథ్యం, ఐశ్వర్య రాయ్ సాధించిన అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు వీరి జంటకు మరింత వన్నె తెచ్చాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికలపై ఈ దంపతులు కలసి సందడి చేయడం భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూనే తమకంటూ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఈ జోడీ నిర్మించుకున్నారు.
కాలం మారుతున్నా? అభిషేక్-ఐశ్వర్యల జంట పట్ల అభిమానుల్లో ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. మీడియాలో ఎన్ని రకాల ఊహాగానాలు, పుకార్లు వచ్చినా? తమ బంధంలో ఆత్మీయతను, గౌరవాన్ని కాపాడుకుంటూ దంపతులు ముందుకు సాగుతున్నారు. నేటికీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన ఐకానిక్ పవర్ కపుల్స్‌లో ఇద్దరు అగ్రగామిగా నిలుస్తున్నారు.
